Hanumantha Reddy
-
అభివృద్ధి, సుస్థిర పాలనకే మా మద్దతు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సీమాంధ్రులమని చెప్పుకుంటూ కొందరు తెలంగాణలో కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆరోపించింది. తెలంగాణలో స్థిరపడిన సుమారు 15 లక్షల మంది సీమాంధ్రులు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలరంటూ తమ పేరుతో కొందరు స్వార్థ రాజకీయాల కోసం వివిధ పార్టీలను 15 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని దుయ్యబట్టింది. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. హనుమంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, సుస్థిర పాలనకే తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి తాము పూర్తి వ్యతిరేకమని తేలి్చచెప్పారు. సెటిలర్స్ అనే పదమే లేదని.. తామంతా తెలంగాణావాసులమేనన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కోసమే తెలంగాణకు.. గ్రేటర్ రాయలసీమ ప్రాంతం (నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం) నుంచి తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది స్థిరపడ్డారని హనుమంతరెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చ ల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, ఉప్పల్, అంబర్పేట్, ముషీరాబాద్, సనత్‌నగర్, నాంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉప్పల్ నియోజకవర్గాలతోపాటు మహ బూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ చాలా మంది వ్యాపారాలు, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన వివరించారు. రాష్ట్రం విడిపోయాక అన్నదమ్ముల్లా కలసిమె లసి ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. ఇక్కడ ఎ లాంటి ఇబ్బందులు లేవన్నారు. దేశంలోనే అ త్యంత వెనుకబడిన, కరువుపీడిన ప్రాంతమైన రా యలసీమ నుంచి విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజలు హైదరాబాద్ సహా తెలంగాణకు వస్తుంటారన్నారు. మాకూ ఓ భవన్ కట్టివ్వాలి... గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ అఫ్ తెలంగాణ సంస్థ స్థాపించి పదేళ్లు అయ్యిందని... ఇందులో 40 వేల మంది సభ్యులు ఉన్నారని హనుమంతరెడ్డి చెప్పారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు వీలుగా ఇతర ప్రాంతవాసులకు కేటాయించినట్లుగా తమ అసోసియేషన్‌కు సైతం ఒక భవనం తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధా న కార్యదర్శి రాఘవ్, బద్రీనాథ్, నిరంజన్ దేశాయ్, చంద్రశేఖర్‌రెడ్డి, కులేశ్వర్‌రెడ్డి, రాజే‹Ù, రాజశేఖర్‌రెడ్డి, రామకృరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు వాడేవారు పేదలు కారని వాదిస్తారు.. కానీ
సంక్షేమ పథకాలూ, వాటిని అమలుచేసే ప్రభుత్వాలపై విమర్శ పెరిగింది. తాము చెల్లిస్తున్న పన్నులతోనే వాటిని అమలు చేస్తున్నారనీ, అలగా జనానికి మా సొమ్ము ఖర్చవుతోందనీ, తమకు అన్యాయం జరుగుతోందనీ మధ్య, ఉన్నత మధ్య తరగతి ప్రజల వాదన. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తారు. వీటిని ఎగేసే అవకాశాలు, ఎగ్గొట్టించే వృత్తి సంస్థలు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తారు. బీడీలు, సబ్బులు, బియ్యం, ఉప్పు పప్పుల పన్నులు ఇలాంటివి. వీటిని తప్పించుకోలేరు. మనం సమాజం నుండి చాలా పొందుతాము. మనం వాడే రోడ్లు, భవనాలు, గ్రంథాలయాలు, విద్యా, వైద్యాలయాలు ప్రజాధనంతో నిర్మించినవే. వాటిపై ప్రభుత్వం నిరంతరంగా నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పెడుతూ ఉంటుంది. ఈ ఖర్చుల కోసం ప్రజలు పన్నులు చెల్లించాలి. ఎవరు ఏ సౌకర్యాలను వాడుతున్నారు, ఎవరు వేటిపై పన్నులు చెల్లించాలి, అని తేల్చటం కష్టం. అందుకే సంపాదనలపై ప్రత్యక్ష పన్నులు, వినియోగాలపై పరోక్ష పన్నులు విధిస్తారు. శ్రమ శక్తి మాత్రమే కలిగిన కార్మికులు సమాజ సౌకర్యాలను తక్కువ వాడుతారు. వాళ్ళు స్థానిక ప్రయాణాలే గాని సుదీర్ఘ ప్రయాణాలు తక్కువ చేస్తారు. చదువుకోనివారు విద్యాలయాలను వాడరు. తులనాత్మకంగా ఆస్పత్రులను కూడా తక్కువ వాడుతారు. చదువరులు, అందులో వైద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం మొదలగు వృత్తి విద్యలను అభ్యసించినవారు ఎక్కువగా ప్రజాధనాన్ని ఉపయోగిస్తారు. సమాజం నుండి ఎక్కువగా నేర్చుకుంటారు. సమాజ సంపద, మౌలిక సదుపాయాలనూ ఎక్కువగా వినియోగిస్తారు. పేదల కంటే, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్కువ మోతాదులో సమాజానికి తిరిగి ఇవ్వాలి. కాని వాళ్ళు సమాజానికి అనగా ప్రభుత్వానికి చెల్లించ వలసినదాని కంటే తక్కువే చెల్లిస్తారు. అందుకే మేము ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాము, మా డబ్బుతో పేదలు, శ్రామికులు బతుకుతున్నారన్న వీరి ప్రచారంలో వాస్తవం లేదు. కార్పొరేట్ సంస్థల అధిపతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, సంపన్నులు ప్రభుత్వాల నుండి మౌలిక సదుపాయాలు, బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. తమ వాణిజ్యంలో ప్రజలకు భాగస్వామ్య కల్పనలో భాగంగా ప్రజల సొమ్మును సేకరిస్తారు. నామమాత్రపు సొంత డబ్బుతో లాభాలు సంపాదిస్తారు. పేదలు, శ్రామికులు, దిగువ మధ్య తరగతి ప్రజలకు తమ శ్రమ శక్తియే సంపాదన వనరు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు, రాయితీలు వారి శ్రమ శక్తి ఉపయోగానికి సౌకర్యాలుగా మారుతాయి. వారు శ్రమ శక్తిని ఎక్కువగా వాడే వెసులుబాటు కలుగుతుంది. దీంతో వారి దిన కూలీ పెరగదు. కాని వారి శ్రమ సాంద్రత, నిపుణత, ఉత్పత్తి స్థాయి, వారు పని చేసే సంస్థల యాజమాన్య లాభాలు పెరుగుతాయి. సమాజం ప్రగతి సాధించి, దేశ సంపదలు అభివృద్ధి చెందుతాయి. సంక్షేమ పథకాలు, రాయితీలు సమాజ శ్రేయస్సు, దేశోన్నతి సాధనాలు. ప్రజలకు సామాజిక దృక్పథం అవసరం. సెల్ ఫోన్లు, మోటర్ సైకిళ్ళు, టీవీలు వాడేవారు పేదలు కారని కొందరు వాదిస్తారు. ఇవి నాగరిక పేదరిక అవసరాలు. సెల్ ఫోన్ రోజు కూలి పని సంపాదనలో, అందుకు అవసరమైన సాధనాల సమకూర్పులో, పని స్థలాల నిర్ణయంలో సహాయపడుతుంది. నగరాల్లో పనిస్థలాలకు చేరుకోడానికి మోటర్ సైకిళ్ళు అవసరం. రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి కృషి చేయవలసిందే. అటువంటి కార్యక్రమాలకు ఎవరూ అడ్డు తగలకూడదు. (క్లిక్ చేయండి: తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
ఏపీ మాజీ ఐపీఎస్ అధికారి హనుమంత రెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
నిందగా మారిన గణచిహ్నం
హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో 1983 నాటి ‘కిసీ సే న కెహనా (ఎవరితో చెప్పొద్దు)’ ప్రసిద్ధ హాస్యచిత్రం. అందులో ‘హనీమూన్’ హోటల్ బోర్డును ‘హనుమాన్’గా మార్చారని హీరోయిన్‌తో అంటాడు హీరో. అలా హనుమాన్ను వ్యాపారీకరించడాన్ని దర్శకుడు చూపించారు. ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ ఈ సినిమా స్క్రీన్ షాట్‌ను చూపి, ‘2014 ముందు హనీమూన్, 2014 తర్వాత హనుమాన్’ అని 4 ఏళ్ల క్రితం ట్వీటారు. ఇది మత భావాలను రెచ్చగొట్టే అంశంగా మారింది. భగవాన్ హనుమాన్ను కోతి అని అవమానించారని జుబేర్‌పై అభియోగం. పురాణాల్లో రాక్షసులు, దేవగణాలు, యక్షులు, రామాయణంలో వానరులు వారి గణచిహ్నాలతో పేర్కొనబడ్డ స్థానిక జాతుల మానవ సమూహాలు. గణచిహ్నాలను రూపాలకు అన్వయించారు. ‘కపి’ పదాన్ని కోతి అని అనువదించారు. సవరులు, శబరులు, ఇతర ఆదివాసీ తెగలవారు రామాయణంలో వానరులుగా పేర్కొనబడ్డారు. వీరు వాలం (తోక) గల నరులు. తోకలాంటి వస్త్రం ధరించే నరులు. వెనుక పొడవుగా వేలాడే గోచీని కట్టుకునేవారు. ఈ గోచీ పురుషులకు మాత్రమే పరిమితం. వాలి భార్య తార, సుగ్రీవుని భార్య రుమాదేవి, ఆంజనేయుని తల్లి అంజనీ దేవి వగైరా వానర జాతి స్త్రీలకు తోకలుండవు. వానరులు, వానర రాజ్యాల గురించి రామాయణం చాలా విషయాలు చెప్పింది. వాటిని కల్పిత, ఉద్దేశపూరిత వక్రీకరణలకు గురిచేశారు. వానరులంటే కోతులని ప్రచారం చేశారు. రాముడు కూడా యుద్ధంలో వానరులు మానవరూపాల్లో ఉండరాదన్నాడు. హరిరూపంలో ఉండాలన్నాడు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, పాము, కోతి, కప్ప అని అర్థాలు. ఆటవికుల ద్వేషులు కోతి అన్న అర్థాన్ని స్థిరీకరించారు. వానరజాతికి కోతిచేష్టలు అంటగట్టి వినోదించారు. వానరులను కోతులను చేసి ఆంజనేయుని అవమానించింది ఆర్య జాత్యహంకారులే. మతవాదులు వారి వారసులు. హేతుబద్ధ ఆలోచనలను ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత సామాజిక శాస్త్రవేత్తలదీ, విజ్ఞులదీ! (క్లిక్: ప్రశ్నించినవారికి నిర్బంధమా?) – సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, గుంటూరు -
అమెరికా పక్కా ప్లాన్! ఆయుధాల అమ్మకమే ఆ దేశ లక్ష్యం
అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాలకూ, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికీ తేడా ఉంది. ఉక్రెయిన్ గగనతలాన్ని రష్యా దిగ్బం ధించింది. విమానాశ్రయా లను ఆక్రమించింది. ఉక్రె యిన్‌లో అమెరికా, నాటో దేశాల ప్రవేశానికి అవకాశం లేకుండా చేసింది. ప్రజా సమూహాల మీద దాడిచేయ లేదు. ప్రాణ నష్టం కనిష్ఠంగా ఉంది. పౌర కమ్యూని కేషన్ వ్యవస్థను నాశనం చేయలేదు. యుద్ధ సమాచార వ్యవస్థను మాత్రమే ధ్వంసం చేస్తున్నది. పౌరుల కదలికల కోసం యుద్ధ విరమణ ప్రకటించింది. అందుకే ప్రజలు సెల్ఫోన్లు వాడుతూనే ఉన్నారు. కన్నయ్య కుమార్ విషయంలో మోదీ మాధ్య మాలు చేసినట్లు పాశ్చాత్య మాధ్యమాలు దృశ్యాలను కాలాంతరీకరించాయి. విషయాంతరీకరించాయి (morphed and doctored). అబద్ధాలు, అతిశ యోక్తులు ప్రదర్శించాయి. యుద్ధంలో సైనిక, జన, ఆస్తి నష్టాలు తప్పవు. ఈ యుద్ధంతో దాదాపు 20 లక్షల ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారు. స్వీడన్ లాంటి ఐరోపా దేశాలు ఈ వలసదారులకు మూడేళ్ల పాటు వీసా లేకుండా ప్రవేశం కల్పించాయి. వసతి, ఉపాధి, తిండి, జీవితావసరాలు ఏర్పాటు చేశాయి. రష్యా తాత్కాలికంగా నష్టపోయింది. అమెరికా బాగా లాభపడింది. రష్యా నుండి జరగవలసిన దిగుమతులు అమెరికా నుండి జరుగుతాయి. చమురు, సహజవాయువు, లోహాలు, ముడిపదార్థాల కోసం రష్యాపై ఆధారపడ్డ నాటో, పాశ్చాత్య దేశాలు విపరీతంగా నష్టపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. మార్కెట్లు పతనమయ్యాయి. యుద్ధా నికి ముందు 90లలో ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లకు చేరింది. 300 డాలర్లకూ చేరు తుందని అంచనా. దీంతో ద్రవ్యోల్బణం, మొత్తం ప్రజల జీవన వ్యయం పెరిగింది. అమెరికా ద్రవ్యో ల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. అమెరికా ఒత్తిడిలో ప్రపంచం ఏకధ్రువం నుండి ఏకఛత్రంగా మారింది. మునుపు పిల్లికి బిచ్చం పెట్టని దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ తటస్థంగా ఉన్న స్వీడన్, అతి తటస్థ స్విట్జర్లాండ్ కూడా ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చాయి. ఈ ఏకఛత్రం భయానకం. ప్రసార మాధ్యమాలు ఆమెరికాకు వంత పాడాయి. పాలకులు సమయస్ఫూర్తి, వివేకం, విచక్షణ, ప్రజాప్రయోజనాలను వదిలి ఉద్రేకంగా ఉపన్యసించారు. నాటో, పశ్చిమ దేశాల నాయకులు అమానవీయంగా ప్రవర్తిస్తూనే గుండె లోతుల్లో ఉక్రె యిన్ గురించి బాధపడుతున్నామంటారు. రష్యా లేని ప్రపంచం అనూహ్యమని పుతిన్ బెదిరిస్తారు. అమెరికా సైన్యాన్ని పంపననడం ఆశ్చర్యం కాదు. యుద్ధ సామగ్రి అమ్మకమే లక్ష్యంగా గల అమెరికా ఇలానే చేస్తుంది. ఉక్రెయిన్ను రెచ్చగొట్టి మోసం చేసింది. ఈ మాట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయే అన్నారు. అమెరికాతో సహా మిగతా దేశాల ఆలోచనా విధానం ఇలాగే కొనసాగితే... ఉక్రెయిన్ను రష్యా ఆక్రమిస్తుంది. కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. రష్యా క్రిమియాను ఆక్రమించినపుడు మిన్నకుండినట్లే అమెరికా ఇప్పుడు కూడా తమాషా చూస్తూ ఊరకుంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా నేతృ త్వంలోని నాటో దేశాల మోసాన్ని గుర్తించారు. బాధ పడ్డారు. నాటో సభ్యత్వం అక్కరలేదన్నారు. డొనేట్సక్, లుహాన్సక్ రిపబ్లిక్ల స్వతంత్రతపై చర్చించాలన్నారు. ఇది యుద్ధవిరమణకు దారితీస్తుందని ఆశిద్దాం. భవిష్యత్తులో అమెరికా, నాటో, పాశ్చాత్య దేశాల పాల కులు అధికార దాహం, కార్పొరేట్ పక్షపాతాన్ని వదిలి ప్రజాపక్షం వహించాలని కోరుకుందాం. సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, మొబైల్: 94902 04545 -
'371డి రద్దు చేస్తామనడం బాధాకరం'
హైదరాబాద్: ఆర్టికల్ 371డి రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం బాధాకరంగా ఉందని జస్టిస్ లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్కడ విశ్రాంత ఐజీ హనుమంతారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. జోనల్ వ్యవస్థ రద్దు చేస్తే రాయలసీమలో నిరుద్యోగం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రాజెక్టులన్నీ ఆంధ్ర ప్రాంతానికే పరిమితం అవుతున్నాయి. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజధాని కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసే బదులు.. రాయలసీమ అభివృద్ధికి యత్నించాలి. రాయలసీమకు న్యాయం చేయకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాల్సి వస్తుంది' అని రిటైర్డ్ ఐజీ హనుమంతారెడ్డి అన్నారు. -
అందమైన ప్రేమకథ
ఓ పల్లెటూరిలో జరిగే ప్రేమకథ నేపథ్యంలో ఎన్. రామవర్థన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గుప్పెడు గుండెను తడితే..’. బసవన్, మైనా జంటగా ఏపీ హనుమంతరెడ్డి నిర్మించారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని తూదొడ్డి గ్రామంలో ఈ చిత్రం షూటింగ్ చేశామనీ, ఇది మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ అని నిర్మాత తెలిపారు. ఇదొక అందమైన ప్రేమకథ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య, కెమెరా: ఆనమ్ వెంకట్, సమర్పణ: పంచలింగాల అమర్నాథ్రెడ్డి.