అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాలకూ, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికీ తేడా ఉంది. ఉక్రెయిన్ గగనతలాన్ని రష్యా దిగ్బం ధించింది. విమానాశ్రయా లను ఆక్రమించింది. ఉక్రె యిన్‌లో అమెరికా, నాటో దేశాల ప్రవేశానికి అవకాశం లేకుండా చేసింది. ప్రజా సమూహాల మీద దాడిచేయ లేదు. ప్రాణ నష్టం కనిష్ఠంగా ఉంది. పౌర కమ్యూని కేషన్ వ్యవస్థను నాశనం చేయలేదు. యుద్ధ సమాచార వ్యవస్థను మాత్రమే ధ్వంసం చేస్తున్నది. పౌరుల కదలికల కోసం యుద్ధ విరమణ ప్రకటించింది. అందుకే ప్రజలు సెల్‌ఫోన్లు వాడుతూనే ఉన్నారు.
కన్నయ్య కుమార్ విషయంలో మోదీ మాధ్య మాలు చేసినట్లు పాశ్చాత్య మాధ్యమాలు దృశ్యాలను కాలాంతరీకరించాయి. విషయాంతరీకరించాయి (morphed and doctored). అబద్ధాలు, అతిశ యోక్తులు ప్రదర్శించాయి. యుద్ధంలో సైనిక, జన, ఆస్తి నష్టాలు తప్పవు. ఈ యుద్ధంతో దాదాపు 20 లక్షల ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారు. స్వీడన్ లాంటి ఐరోపా దేశాలు ఈ వలసదారులకు మూడేళ్ల పాటు వీసా లేకుండా ప్రవేశం కల్పించాయి. వసతి, ఉపాధి, తిండి, జీవితావసరాలు ఏర్పాటు చేశాయి. రష్యా తాత్కాలికంగా నష్టపోయింది. అమెరికా బాగా లాభపడింది.
రష్యా నుండి జరగవలసిన దిగుమతులు అమెరికా నుండి జరుగుతాయి. చమురు, సహజవాయువు, లోహాలు, ముడిపదార్థాల కోసం రష్యాపై ఆధారపడ్డ నాటో, పాశ్చాత్య దేశాలు విపరీతంగా నష్టపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. మార్కెట్లు పతనమయ్యాయి. యుద్ధా నికి ముందు 90లలో ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లకు చేరింది. 300 డాలర్లకూ చేరు తుందని అంచనా. దీంతో ద్రవ్యోల్బణం, మొత్తం ప్రజల జీవన వ్యయం పెరిగింది. అమెరికా ద్రవ్యో ల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది.
అమెరికా ఒత్తిడిలో ప్రపంచం ఏకధ్రువం నుండి ఏకఛత్రంగా మారింది. మునుపు పిల్లికి బిచ్చం పెట్టని దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ తటస్థంగా ఉన్న స్వీడన్, అతి తటస్థ స్విట్జర్లాండ్ కూడా ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చాయి. ఈ ఏకఛత్రం భయానకం. ప్రసార మాధ్యమాలు ఆమెరికాకు వంత పాడాయి. పాలకులు సమయస్ఫూర్తి, వివేకం, విచక్షణ, ప్రజాప్రయోజనాలను వదిలి ఉద్రేకంగా ఉపన్యసించారు. నాటో, పశ్చిమ దేశాల నాయకులు అమానవీయంగా ప్రవర్తిస్తూనే గుండె లోతుల్లో ఉక్రె యిన్ గురించి బాధపడుతున్నామంటారు. రష్యా లేని ప్రపంచం అనూహ్యమని పుతిన్ బెదిరిస్తారు.
అమెరికా సైన్యాన్ని పంపననడం ఆశ్చర్యం కాదు. యుద్ధ సామగ్రి అమ్మకమే లక్ష్యంగా గల అమెరికా ఇలానే చేస్తుంది. ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టి మోసం చేసింది. ఈ మాట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీయే అన్నారు. అమెరికాతో సహా మిగతా దేశాల ఆలోచనా విధానం ఇలాగే కొనసాగితే... ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తుంది. కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. రష్యా క్రిమియాను ఆక్రమించినపుడు మిన్నకుండినట్లే అమెరికా ఇప్పుడు కూడా తమాషా చూస్తూ ఊరకుంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా నేతృ త్వంలోని నాటో దేశాల మోసాన్ని గుర్తించారు. బాధ పడ్డారు. నాటో సభ్యత్వం అక్కరలేదన్నారు. డొనేట్సక్, లుహాన్సక్ రిపబ్లిక్‌ల స్వతంత్రతపై చర్చించాలన్నారు. ఇది యుద్ధవిరమణకు దారితీస్తుందని ఆశిద్దాం. భవిష్యత్తులో అమెరికా, నాటో, పాశ్చాత్య దేశాల పాల కులు అధికార దాహం, కార్పొరేట్ పక్షపాతాన్ని వదిలి ప్రజాపక్షం వహించాలని కోరుకుందాం.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, మొబైల్: 94902 04545
Comments
Please login to add a commentAdd a comment