weapons sales
-
అమెరికా పక్కా ప్లాన్! ఆయుధాల అమ్మకమే ఆ దేశ లక్ష్యం
అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాలకూ, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికీ తేడా ఉంది. ఉక్రెయిన్ గగనతలాన్ని రష్యా దిగ్బం ధించింది. విమానాశ్రయా లను ఆక్రమించింది. ఉక్రె యిన్‌లో అమెరికా, నాటో దేశాల ప్రవేశానికి అవకాశం లేకుండా చేసింది. ప్రజా సమూహాల మీద దాడిచేయ లేదు. ప్రాణ నష్టం కనిష్ఠంగా ఉంది. పౌర కమ్యూని కేషన్ వ్యవస్థను నాశనం చేయలేదు. యుద్ధ సమాచార వ్యవస్థను మాత్రమే ధ్వంసం చేస్తున్నది. పౌరుల కదలికల కోసం యుద్ధ విరమణ ప్రకటించింది. అందుకే ప్రజలు సెల్ఫోన్లు వాడుతూనే ఉన్నారు. కన్నయ్య కుమార్ విషయంలో మోదీ మాధ్య మాలు చేసినట్లు పాశ్చాత్య మాధ్యమాలు దృశ్యాలను కాలాంతరీకరించాయి. విషయాంతరీకరించాయి (morphed and doctored). అబద్ధాలు, అతిశ యోక్తులు ప్రదర్శించాయి. యుద్ధంలో సైనిక, జన, ఆస్తి నష్టాలు తప్పవు. ఈ యుద్ధంతో దాదాపు 20 లక్షల ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారు. స్వీడన్ లాంటి ఐరోపా దేశాలు ఈ వలసదారులకు మూడేళ్ల పాటు వీసా లేకుండా ప్రవేశం కల్పించాయి. వసతి, ఉపాధి, తిండి, జీవితావసరాలు ఏర్పాటు చేశాయి. రష్యా తాత్కాలికంగా నష్టపోయింది. అమెరికా బాగా లాభపడింది. రష్యా నుండి జరగవలసిన దిగుమతులు అమెరికా నుండి జరుగుతాయి. చమురు, సహజవాయువు, లోహాలు, ముడిపదార్థాల కోసం రష్యాపై ఆధారపడ్డ నాటో, పాశ్చాత్య దేశాలు విపరీతంగా నష్టపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. మార్కెట్లు పతనమయ్యాయి. యుద్ధా నికి ముందు 90లలో ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లకు చేరింది. 300 డాలర్లకూ చేరు తుందని అంచనా. దీంతో ద్రవ్యోల్బణం, మొత్తం ప్రజల జీవన వ్యయం పెరిగింది. అమెరికా ద్రవ్యో ల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. అమెరికా ఒత్తిడిలో ప్రపంచం ఏకధ్రువం నుండి ఏకఛత్రంగా మారింది. మునుపు పిల్లికి బిచ్చం పెట్టని దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ తటస్థంగా ఉన్న స్వీడన్, అతి తటస్థ స్విట్జర్లాండ్ కూడా ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చాయి. ఈ ఏకఛత్రం భయానకం. ప్రసార మాధ్యమాలు ఆమెరికాకు వంత పాడాయి. పాలకులు సమయస్ఫూర్తి, వివేకం, విచక్షణ, ప్రజాప్రయోజనాలను వదిలి ఉద్రేకంగా ఉపన్యసించారు. నాటో, పశ్చిమ దేశాల నాయకులు అమానవీయంగా ప్రవర్తిస్తూనే గుండె లోతుల్లో ఉక్రె యిన్ గురించి బాధపడుతున్నామంటారు. రష్యా లేని ప్రపంచం అనూహ్యమని పుతిన్ బెదిరిస్తారు. అమెరికా సైన్యాన్ని పంపననడం ఆశ్చర్యం కాదు. యుద్ధ సామగ్రి అమ్మకమే లక్ష్యంగా గల అమెరికా ఇలానే చేస్తుంది. ఉక్రెయిన్ను రెచ్చగొట్టి మోసం చేసింది. ఈ మాట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయే అన్నారు. అమెరికాతో సహా మిగతా దేశాల ఆలోచనా విధానం ఇలాగే కొనసాగితే... ఉక్రెయిన్ను రష్యా ఆక్రమిస్తుంది. కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. రష్యా క్రిమియాను ఆక్రమించినపుడు మిన్నకుండినట్లే అమెరికా ఇప్పుడు కూడా తమాషా చూస్తూ ఊరకుంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా నేతృ త్వంలోని నాటో దేశాల మోసాన్ని గుర్తించారు. బాధ పడ్డారు. నాటో సభ్యత్వం అక్కరలేదన్నారు. డొనేట్సక్, లుహాన్సక్ రిపబ్లిక్ల స్వతంత్రతపై చర్చించాలన్నారు. ఇది యుద్ధవిరమణకు దారితీస్తుందని ఆశిద్దాం. భవిష్యత్తులో అమెరికా, నాటో, పాశ్చాత్య దేశాల పాల కులు అధికార దాహం, కార్పొరేట్ పక్షపాతాన్ని వదిలి ప్రజాపక్షం వహించాలని కోరుకుందాం. సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, మొబైల్: 94902 04545 -
కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్లు
సాక్షి, హైదరాబాద్: ‘బాప్ బాప్ హీ హోతా బేటా.. నామ్‌తో సునాహీ హోగా న.. సోనూ మోడల్ బోల్తే’ అంటూ బాలీవుడ్ డైలాగ్‌ను కత్తులు పట్టుకున్న ఫొటోపై రాసిన సయ్యద్ ఖలీల్ అనే యువకుడు తన వాట్సాప్‌కు స్టేటస్‌గా పెట్టాడు. ఇలాంటి వాటిని చూపించి స్థానికంగా బెదిరింపుల దందాకు దిగాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టా'స్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని పట్టుకోగా.. భారీ కత్తుల గోదాం వ్యవహారం బయటపడింది. ఈ విషయాన్ని ఆదివారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. బషీర్‌బాగ్‌లోని బ్యాంక్ కాలనీకి చెందిన సయ్యద్ ఖలీల్ ప్లంబర్. ఇతను కొన్నాళ్లుగా వివిధ రకాల కత్తులతో దిగిన ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టేవాడు. వీటిని చూపించి స్థానికంగా బెదిరింపులకు పాల్పడేవాడు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్‌కు సమాచారం అందింది. అతడి కదలికలపై నిఘా ఉంచిన నేపథ్యంలో శనివారం రాత్రి కత్తులతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడని గుర్తించారు. జియాగూడకు చెందిన లాండ్రీ వర్కర్ అంకిత్ లాల్‌తో కలిసి ఉండగా పట్టుకున్నారు. చదవండి: తెలంగాణలోని జిల్లాలకు రెడ్ అలర్ట్ తనిఖీలు చేయగా.. వీరి వద్ద భారీ కత్తులు బయటపడ్డాయి. దీంతో ఇరువురినీ తమ కార్యాలయానికి తరలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా విచారణ చేశారు. వీటిని అంకిత్‌కు సిద్ది అంబర్‌బజార్‌కు చెందిన రతన్ రాజ్ కుమార్ రూ.1400కు విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. వాటి ఫొటోలను తమ స్టేటస్‌లుగా పెడుతున్న ఖలీల్, అంకిత్‌లు రూ.2500 నుంచి రూ.3500కు విక్రయిస్తున్నారు. ప్రధానంగా పెళ్లి బారాత్‌లు, ఉత్సవాల సమయంలో విన్యాసాలు చేయడానికి యువత వీటిని ఖరీదు చేస్తున్నారు. ఆయుధ చట్టం ప్రకారం ఇలాంటి వాటిని అనుమతి లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం నేరం. రతన్ రాజ్ సిద్ధి అంబర్‌బజార్‌లో మహావీర్ గిఫ్ట్ అండ్ నావెల్టీస్ సంస్థ నిర్వహిస్తున్నాడంటూ ఈ ద్వయం బయటపెట్టింది. దీంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు ఆ సంస్థపై దాడి చేసి రతన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన వ్యాపారంలో నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించానని అతడు చెప్పాడు. పెళ్లిళ్లు, పండగల సీజన్ కావడంతో భారీ కత్తులకు డిమాండ్ ఉందనే ఉద్దేశంతో ఢిల్లీలో కొనుగోలు చేసి ట్రాన్స్‌పోర్ట్‌లో రప్పించానని బయటపెట్టాడు. తన గోదాములో దాచి విక్రయాలు చేస్తున్నానన్నాడు. చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం! దీంతో గోదాంపై దాడి చేసిన పోలీసులు భారీ స్థాయిలో పెద్ద, చిన్న కత్తులను స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల నుంచి మొత్తం 87 పెద్ద కత్తులు, ఎనిమిది చిన్న కత్తులు సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ముగ్గురు నిందితులను కత్తులతో సహా సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి వ్యవహారాలు ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
భారత్, పాక్‌లకు అమెరికా ఆయుధాలు
వాషింగ్టన్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాను సందర్శించిన కొద్దిరోజులకే అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు రూ.860.75 కోట్ల ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ కాంగ్రెస్(పార్లమెంటు)కు తెలిపింది. ఈ ఒప్పందం కింద పాకిస్తాన్‌కు గతంలో అమ్మిన ఎఫ్–16 ఫైటర్జెట్లను 24 గంటల పాటు పర్యవేక్షిస్తామనీ, ఇందుకు 60 మంది కాంట్రాక్టర్లను నియమిస్తామని వెల్లడించింది. పాకిస్తాన్‌కు తాము ఎలాంటి ఆర్థికసాయం అందించడం లేదనీ, మొత్తం రూ.860.75 కోట్లను పాక్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పాక్‌కు గతంలో ఆర్థికసాయాన్ని నిలిపివేయడంపై అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని తేల్చిచెప్పింది. మరోవైపు భారత్‌కు రూ.4,613 కోట్ల విలువైన ఆయుధాలను అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. ఈ ఒప్పంద కింద బోయింగ్ సీ–17 గ్లోబ్‌మాస్టర్ సైనిక రవాణా విమానానికి కావాల్సిన పరికరాలు, సిబ్బందికి శిక్షణ, శిక్షణా పరికరాలను అందిస్తామని చెప్పింది. యుద్ధసమయాల్లో సైన్యాన్ని తరలించేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ సీ–17 విమానాన్ని వినియోగిస్తున్నారు. -
ధనా ‘ధన్’
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఓ నిరాయుధీకరణ, శాంతియుత ప్రపంచం కోసం ఉద్యమాలు, ఒప్పందాలు జరుగుతోంటే.. మరోవైపు విధ్వంసాలకు కారణమవుతున్న ఆయుధ వ్యాపారం వేల కోట్ల రూపాయలతో పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో శాంతి నెలకొనాలంటూ ప్రకటనలు, భారీ స్పీచులు ఇస్తున్న అగ్రరాజ్యాలే.. ఈ ఆయుధ వ్యాపారంలో మొదటివరసలో ఉండటం గమనార్హం. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాత ఆయుధ వ్యాపారం కాస్త మందగించింది. అయితే, అమెరికా, రష్యాలు మళ్లీ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండటం.. చైనా వీరికి పోటీ రావడంతో 2002 నుంచి ఈ వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. దీనికితోడు సిరియా, యెమెన్ తదితర దేశాల్లో అంతర్యుద్ధాలు, దాయాది దేశాల మధ్య ఘర్షణలు ఈ ఆయుధ వ్యాపారానికి ఆజ్యం పోస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏటా 10 వేల కోట్ల డాలర్ల (దాదాపు రూ.7లక్షల కోట్లు) ఆయుధ వ్యాపారం సాగుతోందని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రీ)కి చెందిన సీనియర్ పరిశోధకుడు పీటర్ వెజెమన్ చెబుతున్నారు. 2008–12తో పోలిస్తే 2013–17లో భారీ ఆయుధాల అమ్మకాలు 10% పెరిగాయని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. పశ్చిమాసియానే మొదటి కస్టమర్ అమెరికా నుంచి చాలా దేశాలు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నా.. మెజారిటీ వాటామాత్రం పశ్చిమాసియా దేశాలదే. 2013–17మధ్య అమెరికా ఆయుధ ఎగుమతుల్లో దాదాపు సగం ఈ దేశాలకే జరిగాయి. ఇందుకు కారణం పశ్చిమాసియా దేశాల్లో రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండటమే. ముఖ్యంగా సిరియా, యెమెన్లలో అంతర్యుద్ధాలు ఆయుధ వ్యాపారానికి ఆజ్యం పోశాయి. సౌదీ ఆరేబియా, ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు కూడా అమెరికా నుంచి ఆయుధాలు దిగుమతి జాబితాలో ముందున్నాయి. 2012–16 మధ్యలో పశ్చిమాసియా దేశాల ఆయుధ దిగుమతులు 86% పెరిగాయని, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆయుధ దిగుమతుల్లో ఇది 29% అని నిపుణులు చెబుతున్నారు. అమెరికాయే నంబర్ వన్ ఆయుధాల ఎగుమతిలో అమెరికాదే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆయుధ విక్రయాల్లో 34% వాటా అమెరికాదేనని సిప్రీ స్పష్టం చేసింది. ఐదేళ్ల క్రితం ఇది 30%. అమెరికా నుంచి భారీమొత్తంలో ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో సౌదీ అరేబియా ముందుంది. ఆయుధాల ఎగుమతి జాబితాలో అమెరికా తర్వాత స్థానం రష్యాదే. అయితే, రష్యాతో పోలిస్తే అమెరికా 58% ఎక్కువ ఎగుమతి చేస్తోంది. 2008–12తో పోలిస్తే 2013–17 మధ్య కాలంలో అమెరికా ఆయుధ విక్రయాలు 25% పెరగగా.. రష్యా విక్రయాలు 7.1% తగ్గాయి. మొత్తం ఆయుధ ఎగుమతుల్లో 74% వాటా.. అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, చైనాలదేనని సిప్రీ వివరించింది. ఆఫ్రికాలో చిల్లర ఆయుధాలే అన్ని దేశాల్లో ఆయుధాల దిగుమతులు పెరుగుతోంటే ఆఫ్రికా దేశాల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. ఐదేళ్లలో ఈ దేశాల ఆయుధ దిగుమతులు 22% తగ్గాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతమాత్రాన.. ఆఫ్రికా దేశాల్లో యుద్ధాలు జరగడం లేదని, ఆ దేశాలు ఆయుధాలను కొనడం మానేస్తున్నాయని దీనర్థం కాదు. సాధారణంగా కాంట్రాక్టు విలువల ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయుధ విక్రయాలను లెక్కిస్తారు. భారీ ఆయుధాల కొనుగోలుకే కాంట్రాక్టులు ఉంటాయి. చిన్న, తేలికపాటి ఆయుధాలు ఈ లెక్కలోకి రావు. ఉదాహరణకు ఏ దేశమైనా మూడు పెద్ద ఓడల నిండా మెషిన్గన్లను దిగుమతి చేసుకుంటే అవి అంతర్జాతీయ స్థాయి లెక్కల్లోకి రావు. ఆఫ్రికా దేశాల్లో దిగుమతులు తగ్గడానికి కారణం కూడా ఇదే. ఈ దేశాలన్నీ చిన్న చిన్న ఆయుధాలనే బాగా కొంటున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. దూసుకొస్తున్న చైనా అమెరికాతో వాణిజ్య, సాంకేతిక రంగాల్లోనే కాక ఆయుధ విక్రయాల్లో కూడా చైనా పోటీ పడుతోంది. చైనా తన రక్షణ బడ్జెట్‌ను పెంచుకోవడంతో పాటు ఆయుధ సరఫరాదారుగా కూడా మార్కెట్లోకి ప్రవేశించింది. తాజా వివరాల ప్రకారం.. ప్రస్తుతం చైనా ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆయుధ విక్రేత. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీల తర్వాతి స్థానం చైనాదే. ఇటీవలే బ్రిటన్ను వెనక్కు నెట్టి డ్రాగన్ కంట్రీ ఐదో స్థానాన్ని సంపాదించుకుంది. 2008–12తో పోలిస్తే 2013–17 మధ్య చైనా ఆయుధ ఎగుమతులు 38% పెరిగాయి. అమెరికా తర్వాత అత్యధిక రక్షణ బడ్జెట్ కలిగిన దేశం కూడా చైనాయే. అత్యాధునిక ఆయుధాల తయారీలో కూడా చైనా ముందుందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌కు చెందిన పరిశోధకురాలు మియా నౌవెన్స్ అన్నారు. సొంతంగా యుద్ధనౌకలను నిర్మించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఆయుధాలను విక్రయించడం ద్వారా బలమైన సైనిక శక్తిగా ఎదగాలని చైనా ఆకాంక్షిస్తోంది. 2013–17 మధ్య చైనా 48 దేశాలకు ఆయుధాలు విక్రయించింది. అయితే చైనా ఆయుధాల్లో ఎక్కువశాతం పాకిస్తాన్ ఖాతాలో చేరాయి. అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఆయుధాలు విక్రయించని.. ఇరాన్, వెనెజులా, సుడాన్, జింబాబ్వే వంటి దేశాలకు కూడా చైనా ఆయుధాలు విక్రయిస్తోంది. చైనా దూకుడుతో పోటీ పడేందుకు భారత్‌కూడా తన రక్షణ బడ్జెట్‌ను నెమ్మదిగా పెంచుతోంది. 2008–12తో పోలిస్తే 2013–17లో భారత్ రక్షణ దిగుమతులు 24% పెరిగాయి. యుద్ధ విమానాలకు గిరాకీ ఆయుధాల తయారీ, ఎగుమతుల్లో తాజా ట్రెండ్ యుద్ధ విమానాలదే. 2027 కల్లా యుద్ధ విమానాల మార్కెట్ 24,900 కోట్ల డాలర్లకు (రూ.16.6 లక్షల కోట్లు) చేరుతుందని, 3,243 యుద్ధ విమానాలు తయారవుతాయని ఫోర్కాస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ‘ద మార్కెట్ ఫర్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్’పేరుతో విడుదల చేసిన అధ్యయన నివేదికలో పేర్కొంది. ఈ పదేళ్లలో తయారైన యుద్ధ విమానాలకంటే 13.1% ఎక్కువ విమానాలు వచ్చే పదేళ్లలో తయారవుతాయని పేర్కొంది. వచ్చే పదేళ్లలో ఏటా సగటున 280 విమానాలు తయారవుతాయని వెల్లడించింది. ఇందులో 1,466 విమానాలు లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసే ఎఫ్–35 విమానాలేనని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం వచ్చే పదేళ్లలో అమెరికా ఎక్కువగా ఎఫ్–35 యుద్ధవిమానాలను కొంటుంది. భవిష్యత్తులో లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసే ఎఫ్–35 విమానాలను చాలా దేశాలు కొనే అవకాశం ఉంది. ఈ మార్కెట్లో 45% లాక్‌హీడ్ సొంతం చేసుకోనుంది. బోయింగ్ ఎఫ్–16, ఎఫ్/ఏ–18ఈ సూపర్ హార్నెట్, లాక్‌హీడ్ ఎఫ్–16 యుద్ధ విమానాలకు కూడా మళ్లీ డిమాండు పెరుగుతోంది. పశ్చిమాసియా దేశాల నుంచి యుద్ధ విమానాలకు ఎక్కువ డిమాండు ఉండబోతోంది. ఆ మేరకు బోయింగ్, లాక్‌హీడ్, డస్సాల్ట్, యూరోఫైటర్ కన్సార్టియంలు ఉత్పత్తిని పెంచుకోవలసి ఉంటుందని ఫోర్కాస్ట్ సంస్థ నిపుణుడు డగ్లాస్ రాయస్ చెప్పారు. వచ్చే పదేళ్లలో యూరోఫైటర్ టైఫూన్లు 95, డసాల్ట్ రఫేల్ విమానాలు 158 బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం కుదుర్చుకున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలేమీ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కూడా దానిపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. పార్లమెంటులో అధికార, విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఆందోళన ఆయుధ వ్యాపారం మానవహక్కులను కాలరాస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపిస్తోంది. యుద్ధాలను, తిరుగుబాట్లను అణచివేసేందుకు వినియోగిస్తున్న ఆయుధాలు అమాయక పౌరులను బలితీసుకుంటున్నాయని.. ఆమ్నెస్టీ ఆయుధ వ్యాపార నిపుణుడు అలివర్ ఫీలే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధ వ్యాపారం ఎంతగా పెరిగితే మానవాళికి ముప్పు అంతగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యెమెన్ యుద్ధంతో స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే వంటి దేశాలు పశ్చిమాసియాలో ఆయుధాల విక్రయంపై ఆంక్షలు విధించాయని అలివర్ తెలిపారు. ఆయుధ వ్యాపారానికి వ్యతిరేకంగా ‘క్యాంపెయిన్ అగెనెస్ట్ ద ఆర్మ్స్ ట్రేడ్ (సీఏఏటీ) పేరుతో ఉద్యమం కూడా నడుస్తోంది. సౌదీకి బ్రిటన్ ఆయుధాలు విక్రయించడం సీఏటీటీకి విరుద్ధమంటూ.. ఈ సంస్థ బ్రిటన్ న్యాయస్థానంలో కేసు వేసింది. అయితే, బ్రిటన్ ఆయుధ విక్రయాలు చట్టబద్ధమేనని గత జూలైలో ఆ కోర్టు తీర్పునిచ్చింది. -
ఆ ఆయుధాల విక్రయం నిలిపేశాం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఆరోపణలపై హైదరాబాద్‌లో కేసులు నమోదు కావడంతో స్నాప్‌డీల్ సంస్థ దిగివచ్చింది. తమ వెబ్సైట్లో ఉన్న ఆయా ఆయుధాల మెనూను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని నగర పోలీసులకు వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలసి స్నాప్‌డీల్ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. స్నాప్‌డీల్ చేస్తున్న ఆయుధ వ్యాపారాన్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత వారం గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయుధ చట్టం ప్రకారం 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, రెండు అంగుళాల కంటే ఎక్కువ వెడల్పుతో కూడిన ఆయుధాలు సరైన అనుమతులు లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం, ఖరీదు చేయడం నేరం. ఖరీదు చేసినందుకు సిటీకి చెందిన పలువురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు విక్రయించిన ఆరోపణలపై స్నాప్‌డీల్‌కు నోటీసులు జారీ చేశారు. పునరావృతం కాకుండా చూస్తాం.. దీంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను కలసి ఆ సంస్థ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. తాము నేరుగా ఎలాంటి ఉత్పత్తుల విక్రయాలు చేయమని, అటు విక్రేతలు.. ఇటు కొనుగోలుదారులకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే పని చేస్తామని వివరణ ఇచ్చింది. ఈ ఆయుధాలను గుజరాత్‌కు చెందిన సంస్థ తమ సైట్ ద్వారా విక్రయిస్తోందని పేర్కొంది. అయితే క్రయవిక్రయాలకు ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరించిన నేపథ్యంలో స్నాప్‌డీల్‌కు విక్రేత కొంత మేరకు కమీషన్ చెల్లిస్తాడు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం బాధ్యులవుతారని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తమ వెబ్సైట్ నుంచి పరిమితికి మించిన పొడవు, వెడల్పులతో ఉన్న ఆయుధాల మెనూను తొలగించామని, విక్రయాలు ఆపేశామని స్పష్టం చేశారు. దీంతో గుజరాత్ సంస్థకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన పోలీసులు.. స్నాప్‌డీల్‌పై చర్యలకు సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. ఇతర వెబ్సైట్లలోనూ... స్నాప్డీల్లోనే కాదు.. ఏ ఈ–కామర్స్ సైట్లలో చూసినా కత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంటున్నాయని పోలీసులు గుర్తించారు. రూ.వెయ్యి నుంచి రూ.8 వేల వరకు వివిధ ఆకృతులు, సైజుల్లో వీటిని విక్రయించేస్తున్నారని ఆధారాలు సేకరించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయా వెబ్సైట్లకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్లైన్లో కత్తులు అందుబాటులోకి రావడంతో అనేక మంది అవసరం ఉన్నా లేకున్నా, చట్ట విరుద్ధమని తెలిసో తెలియకో వీటిని ఖరీదు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. -
40వేల కోట్లతో ఆధునిక ఆయుధాలు
న్యూఢిల్లీ: రూ. 40 వేల కోట్లతో అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసేందుకు భారత ఆర్మీ సిద్ధమైంది. 7 లక్షల రైఫిళ్లు, 44 వేల తేలికపాటి మెషిన్ గన్లు (ఎల్ఎంజీ), దాదాపు 44,600 కార్బైన్లను ఆర్మీ కొనుగోలు చేయనుంది. వీటి కొనుగోలుకు సుమారు రూ. 40 వేల కోట్లు అవసరమవుతుందని లెక్కగట్టింది. సరిహద్దులో చైనా, పాకిస్తాన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలు అవసరమని వెంటనే వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు కేంద్రానికి ఆర్మీ విజ్ఞప్తి చేసింది. దీంతో రక్షణ శాఖ నుంచి ఈ కొనుగోలు ప్రక్రియకు ముందడుగు పడింది. ఈ కొనుగోలు ప్రణాళిక కాకుండా ఎల్ఎంజీ తరహా చిన్న ఆయుధాలను వీలయినంత త్వరగా సిద్ధం చేసి ఆర్మీకి అందించాలని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త 7.62 మి.మీ. అసాల్ట్ రైఫిల్ ప్రత్యేకతలను ఆర్మీ సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపగా వాటికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ), రక్షణ మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు త్వరలోనే సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో 7 లక్షల 7.62గీ51 ఎంఎం అసాల్ట్ గన్లను ఇవ్వాలని ఆర్మీ కోరింది. -
పడిపోతున్న అమెరికా ఆయుధాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆయుధాల అమ్మకాల్లో అమెరికా క్రమక్రమంగా వెనకబడుతోంది. ఆ స్థానంలో యూరప్ దేశాలు తమ మార్కెట్లను పెంచుకుంటున్నాయి. ప్రపంచంలో అమెరికా ఆయధాల విక్రయాలు తగ్గడం వరుసగా ఇది ఐదో సంవత్సరం. అయినా ఇప్పుటికీ ఆయుధాలు ఎగుమతి చేయడంలో అమెరికాదే అగ్రస్థానం. ఆయుధాల అమ్మకాల్లో ఇప్పటికీ 54 శాతం వాటా అమెరికాదే. అమెరికా ఆయుధాల అమ్మకాలు తగ్గిపోవడానికి కారణం తన రక్షణ కేటాయింపులపై పరిమితులు విధించడమేనని స్టాక్‌హోమ్ లోని అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ తెలియజేసింది. 2014వ సంవత్సరంతో పోలిస్తే 2015 సంవత్సరానికి ఆమెరికా ఆయుధాల అమ్మకాలు మూడు శాతం తగ్గాయి. 2015 సంవత్సరంలో రష్యా అయుధాల అమ్మకాలు 6.2 శాతం పెరిగాయి. 2014లో 48 శాతం, 2013లో 20 శాతం పెరిగాయి. వరుసగా అమ్మకాల్లో చెప్పుకోతగ్గ పురోభివృద్ధి ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అమ్మకాల్లో రష్యా అమ్మకాల వాటా ఇప్పటికీ 8.1 శాతం మాత్రమే. రక్షణ ఉత్పత్తులను పెంచడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ వాటిపై పెట్టుబడులను తీవ్రంగా పెంచుతూ పోతున్నారు. 2025 సంవత్సరం నాటికల్లా ఈ పెట్టుబడులను 70,000 కోట్ల డాలర్లకు పెంచాలన్నది ఆయన లక్ష్యం. 2015 సంవత్సరంలో అమెరికా 20,900 కోట్ల డాలర్ల ఆయుధాలను విక్రయించడం ఇక్కడ గమనార్హం. అంటే ఈవిషయంలో అమెరికాను అధిగమించి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం రష్యా లక్ష్యంగా కనిపిస్తోంది. ఫ్రెంచ్ రక్షణ సంస్థలు కూడా తమ అమ్మకాలను క్రమంగా పెంచుకుంటున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2015 సంవత్సరంలో ఫ్రెంచ్ రక్షణ కంపెనీలు తమ అమ్మకాలను 13 శాతం పెంచుకున్నాయి. ఈజిప్టు, ఖతార్, జర్మనీ కంపెనీలకు ఆయుధాలను విక్రయించడం ద్వారానే ఈ కంపెనీలు దాదాపు 7 శాతం అమ్మకాలను పెంచుకున్నాయి. 2014 సంవత్సరంతో పోలిస్తే 2015 సంవత్సరానికి బ్రిటీష్ కంపెనీలు కూడా ఆయుధాల అమ్మకాలను 2.8 శాతం పెంచుకున్నాయి. ద క్షిణ కొరియా అమ్మకాల్లో 2015 సంవత్సరానికే 32 శాతం వృద్ధిరేటు కనిపించింది. అయితే ఇందులో ఎక్కువ వాటాను దేశ సైన్యమే కొనుగోలు చేసింది. చైనా ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన వివరాలు మాత్రం అందుబాటులో లేవు.