ఆపేస్తే ఒప్పుకోం.. వారంలో మొదలు పెట్టండి | you should start work at palamaneru with in weak : ysrcp | Sakshi

ఆపేస్తే ఒప్పుకోం.. వారంలో మొదలు పెట్టండి

Apr 14 2015 4:38 PM | Updated on May 29 2018 4:18 PM

టీడీపీ వల్లే పలమనేరు నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి అన్నారు.

చిత్తూరు: టీడీపీ వల్లే పలమనేరు నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి అన్నారు. టీడీపీ నేతల ప్రోద్భలంతోనే జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనులు నిలిపేశారని ఆయన ఆరోపించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ను కలిసి వివరాలు కోరారు. వారంలోగా పనులు చేపట్టకపోతే కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. పట్టి సీమ వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఎక్కడా చెప్పలేదని అన్నారు. పోలవరం కడితేనే రాయలసీమలోని హంద్రీనీవాకు నీళ్లొస్తాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement