పలమనేరు: పలమనేరులో టీడీపీ రాజకీయాలు రసపట్టుగా మారాయి. మంత్రి అమరనాథరెడ్డితో విభేదించి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న పార్టీ నాయకులు సుభాష్ చంద్రబోస్ ఎట్టకేలకు తాను టీడీపీ రెబల్‌గా పోటీలో కొనసాగుతానని సృష్టం చేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులతో కలసి గురువారం సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఈయన పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలోకి వస్తాడంటూ ప్రచారం కూడా సాగింది. అయితే తన ఎదుగుదలకు అడ్డుకుని తనకు పార్టీలో గౌరవం లేకుండా పోయిన చోటే మళ్లీ తన సత్తా ఏంటో చూపుతానంటూ ఆయన టీడీపీలోనే రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు.
నేడు ఓ సెట్ నామినేషన్ ఈనెల 25న నాయకులు, అభిమానుల మధ్య మరో సెట్ నామినేషన్ వేసి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, ఎన్టీఆర్ బొమ్మతో జనం ముందుకు వెళతానని తేల్చి చెప్పారు. రెండు రోజుల కిందట పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ హేమంత్‌కుమార్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయంతో మంత్రి అమరనాథ్‌కు షాక్ తగిలింది. ఈ నేథప్యంలో రెబల్çగా బరిలో దిగుతానని బోస్ తేల్చి చెప్పడంతో మంత్రికి మరో గట్టి షాక్ తగిలినట్టయింది. మొత్తం మీద పలమనేరు టీడీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment