రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబులే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్, అమర్నాథ్రెడ్డిలు ఆరోపించారు. బుధవారం కడపలో వారు మాట్లాడుతూ... కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని విభజనకు సూచనలు ఇస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు తన కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసి యూటర్న్ తీసుకున్నట్లు చంద్రబాబు, కిరణ్లు నటిస్తున్నారని చెప్పారు. సమైక్యరాష్ట్రం కోసం వైఎస్ జగన్ ఒక్కరే పోరాడుతున్నారని వారు ఈ సందర్బంగా స్పష్టం చేశారు. సమైక్యవాదానికి లేక విభజనవాదానికి అనుకూలమో వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని కిరణ్, చంద్రబాబులను ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.