సీఎం సమైక్యవాది కాదు వల్లకాడు వాది | Srikanth Reddy takes on CM Kiran Kumar Reddy and Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సీఎం సమైక్యవాది కాదు వల్లకాడు వాది

Published Sat, Feb 15 2014 1:30 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సీఎం సమైక్యవాది కాదు వల్లకాడు వాది - Sakshi

సీఎం సమైక్యవాది కాదు వల్లకాడు వాది

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది కాదు వల్లకాడు వాదని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో ఎద్దేవా చేశారు. సచివాలయంలో ఆయన ఓవర్టైం డ్యూటీ చేస్తూ జీవోలపై పెన్నుతో బ్యాటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు విభజనకు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. తాడేపల్లి గూడెంలో శనివారం నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభలోనైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్యమన్న మాట పలుకుతారని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు.

 

రాష్ట్ర విభజనను సాక్షాత్తూ చంద్రబాబే కోరుకుంటుంటే ఆ పార్టీ నేతలు మాత్రం దేశంలో ఎందుకు కలిసుండాలని మాట్లాడటం దారుణమని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి బయటకు రండి అంటు రాష్ట్ర సమైక్యాన్ని కోరుకుంటున్న టీడీపీ నేతలకు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అడ్డగోలు నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని పేర్కొన్నారు. తమ పార్టీ ఎంపీలతో సమైక్యానికి అనుకూలంగా ఓటు వేసేలా విప్ జారీ చేయాలని చంద్రబాబుకు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement