బిట్స్‌లో కోలాహలంగా ‘వేద’
బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన ‘వేద’ కార్యక్రమం కోలాహలంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి 11 కళాశాలలకు చెందిన 950 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారికి భవిష్యత్‌లో ఉపాధినిచ్చే సబ్జెక్ట్‌లపై అవగాహన కల్పించారు.
శామీర్‌పేట్ రూరల్: బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన ‘వేద’ కార్యక్రమం కోలాహలంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి 11 కళాశాలలకు చెందిన 950 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారికి భవిష్యత్‌లో ఉపాధినిచ్చే సబ్జెక్ట్‌లపై అవగాహన కల్పించారు. గౌరవ అతిథులుగా ఐటీ శాఖ చీఫ్ రిలేషన్, స్టార్టజీ అధికారి అమర్‌నాథ్‌రెడ్డి, నిసా డీఐజీ విక్రమ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, దాన్ని చేరుకునేందుకు శ్రమించాలని అన్నారు. విద్యార్థులు పదిమందికి ఉపాధి కల్పించేవిధంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న వారు భవిష్యత్తులో రాణిస్తారని ఆకాంక్షించారు.
20 యేళ్ల క్రితం ఇలాంటి అవకాశాలు ఉండేవి కావన్నారు. అందివచ్చిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఉపాధినిచ్చే సబ్జెక్ట్‌లపై అవగాహన కల్పించడం బాగుందన్నారు. ఐఐటి, ఐఐఐటీ, బిట్స్ లాంటి ఉన్నతమైన విద్యాసంస్థల గురించి అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. బిట్స్‌లో చదివి సివిల్స్‌లో 280వ స్థానం దక్కించుకున్న అలంకృత అనే విద్యార్థిని విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్, కృష్ణమూర్తి ఐఐటీ అకాడమీ, సెయింట్ పాట్రిక్స్, నారాయణ, శ్రీచైతన్య, నానో, ఐఐటీ రామయ్య, శరత్, సంజీవని ఐఐటీ అకాడమీ, డెల్టా జూనియర్ కళాశాల, ఫిడ్జ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.