
'చంద్రబాబుపై ఈసీ చర‍్యలు తీసుకోవాలి'
కడప: ఎమ్మెల్సీ ఎన్నికల నియమామళి అమలులో ఉండగా ముఖ‍్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సమావేశమై వారికి పలు హామీలు గుప్పిండచంపై ఎన్నికల సంఘం చర‍్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ‍్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల‍్యేలు రవీంద్రనాథరెడ్డి, శ్రీనివాసులు ఆదివారం మధ్యాహ‍్నం కడపలో మీడియాతో మాట్లాడారు. ముఖ‍్యమంత్రి చంద్రబాబు చర‍్యలు ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద‍్ధమని, కనుక తక్షణమే ఎన్నికల సంఘం ముఖ‍్యమంత్రిపై చర‍్యలు తీసుకోవాలన్నారు.