
సాక్షి, చిత్తూరు : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్నీ చేస్తామని వెంట ఉండి.. నాలుగేళ్ల పాటు నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీ కంటే.. ముందే మాట చెప్పి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను నమ్మొచ్చని అన్నారు. మరో వైపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఆయన వ్యక్తిగతమన్నారు. అదేవిధంగా ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోనే కొనసాగుతారని, రానున్న ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లా కేంద్రంలో వనం- మనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో మామిడి రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రైతుల సమస్యలను అధిగమించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment