ఎంపీ జన్మదినం తెచ్చిన తంటా | TRS leaders suspension | Sakshi
Sakshi News home page

ఎంపీ జన్మదినం తెచ్చిన తంటా

Published Sun, Jul 23 2017 2:17 AM | Last Updated on Thu, Aug 9 2018 8:51 PM

TRS leaders suspension

ఎంపీపీ సహా నలుగురి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల సస్పెన్షన్‌
 
వేములవాడ: కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ జన్మదిన వేడుకలు టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ప్రజా ప్రతినిధుల సస్పెన్షన్‌కు దారి తీశాయి. వేములవాడ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజాప్రతినిధులు శని వారం ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎంపీ జన్మదిన వేడుకలను భారీఎత్తున నిర్వహించారు. తొలుత ర్యాలీ నిర్వహించారు. తన ఇలాఖాలో ఎంపీ జన్మదిన వేడుకలు నిర్వహించడం ఏమిటంటూ స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబు కోపోద్రిక్తులయ్యారు.

వేడుకలు నిర్వహించినందుకు వివిధ కారణాలు చూపుతూ ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్‌తోపాటు నాయకులు చిలుక పెంటయ్య, పూడూరి రాజిరెడ్డి, రాజాగౌడ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని ప్రకటించారు. వీరికి టీఆర్‌ఎస్‌ తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ చర్య గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement