సాక్షి,హైదరాబాద్:బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి కూడా ప్రచారం చేసుకోకపోవడం వల్లే నష్టపోయామని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో వినోద్‌కుమార్ గురువారం(అక్టోబర్10) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. మార్కెటింగ్‌లో మాత్రం ఆయనను మించినవాడు లేడు. మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన చరిత్ర నాకుంది. నాకెవవరూ ఉద్యోగం ఇవ్వలేదు. నేను స్వయంగా అడ్వకేట్‌ను. నేను తెలంగాణ వాదిని.
కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని రేవంత్‌రెడ్డి గతంలో చెప్పాడు. ఎన్నికల హామీ మేరకు డిసెంబర్ నాటికి 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం లక్షా 60వేల ఉద్యోగాలు నింపలేదని భట్టి చెప్పగలరా? ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించే బాధ్యతను ఎమ్మెల్సీ కోదండరాం తీసుకోవాలి.
జేఏసీని నడిపిన అనుభవం ఉన్న కోదండరాం.. సీఎం రేవంత్‌కు ఉద్యోగాలపై సమాచారం ఇవ్వాలి. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని రేవంత్ రాజకీయ సభల మాదిరి నిర్వహిస్తున్నారు.
ఉద్యోగాల నియామకం ఎలా జరుగుతుందో కూడా మంత్రులు భట్టి, పొన్నంకు తెలియదు.బీఆర్ఎస్ హాయాంలో ఒక లక్షా 61వేల 572మందికి ఉద్యోగాలు ఇచ్చాం.కేసీఆర్ సీఎంగా ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారు.కేసీఆర్ హాయాంలో నింపిన ఉద్యోగాల సమాచారం.. మంత్రులకే తెలియకపోవడం దౌర్భాగ్యం’అని వినోద్‌కుమార్ అన్నారు.
కేసీఆర్ హయాంలో ‘2014 నుంచి 2023’ వరకు జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇవే..
ఇదీ చదవండి: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
Comments
Please login to add a commentAdd a comment