సిరిసిల్లను కేటీఆర్.. యాదాద్రిని నాయిని | kcr inaugurates siddipet district | Sakshi
Sakshi News home page

సిరిసిల్లను కేటీఆర్.. యాదాద్రిని నాయిని

Published Tue, Oct 11 2016 11:46 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

kcr inaugurates siddipet district

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్రంలో సరికొత్త పరిపాలనా ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను మంత్రి కేటీఆర్ ప్రారంభించగా... యాదాద్రి జిల్లాను నాయిని నర్సింహరెడ్డి ప్రారంభించారు. మిగిలిన 19 జిల్లాలను శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, మంత్రులు ప్రారంభించారు. దీంతో 31 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఈ జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లతోపాటు జిల్లా ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   


జనగామ జిల్లా :
ఈ జిల్లాను తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. దేవసేనతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆచార్య జయశంకర్ జిల్లా :
ఈ జిల్లాను తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
జిగిత్యాల జిల్లా :
ఈ జిల్లాను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కె. కవితతోపాటు జిల్లా కలెక్టర్ ఎ. శరత్, ఎస్పీ అనంత్ శర్మ, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా:
ఈ జిల్లాను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి, ఎస్పీ చంద్రదీప్తీతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వరంగల్ గ్రామీణ జిల్లా:
ఈ జిల్లాను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్,  ఎస్పీ సుధీర్బాబుతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

యాదాద్రి జిల్లా:
ఈ జిల్లాను హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎస్పీ యాదగిరితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా:
ఈ జిల్లాను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి వీఎస్, ఎస్పీ విజయేందర్రెడ్డి పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా:
ఈ జిల్లాను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్.సత్యనారాయణ, ఎస్పీ శ్వేత పాల్గొన్నారు.  

మంచిర్యాల జిల్లా:
ఈ జిల్లాను ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, ఎస్పీ జాన్ వెస్లీతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వికారాబాద్ జిల్లా:
ఈ జిల్లాను రవాణాశాఖ మంత్రి పి. మహేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి. దివ్య పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా
ఈ జిల్లాను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ విశ్వజిత్తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కొమురంభీం జిల్లా
ఈ జిల్లాను అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎం చంపాలాల్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
సూర్యాపేట జిల్లా
ఈ జిల్లాను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, ఎస్పీ పరిమళ నూతన్తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భద్రాద్రి జిల్లా:
ఈ జిల్లాను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్ కిషోర్ ఝాతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా:
ఈ జిల్లాను దేవాదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలంబర్తి, ఎస్పీ విష్ణు వరియార్తోపాటు జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నాగర్కర్నూలు జిల్లా:
ఈ జిల్లాను పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సింగన్వార్తోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మహబూబాబాద్ జిల్లా:
ఈ జిల్లాను పర్యాటక శాఖ మంత్రి ఎ. చందూలాల్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా, ఎస్పీ మురళీతోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

జోగులాంబ గద్వాల్ జిల్లా
ఈ జిల్లాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రజత్కుమార్ సైనీ, ఎస్పీ విజయ్కుమార్తోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.   

మేడ్చల్ జిల్లా/మల్కాజ్గిరి జిల్లా
ఈ జిల్లాను తలసాని శ్రీనివాసయాదవ్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి పాల్గొన్నారు.

వనపర్తి జిల్లా
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, ఎస్పీ రోహిణితోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement