తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించాల్సిన విషయాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
కాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసేది అఖిలపక్ష సమావేశం కాదని, ఏకపక్ష సమావేశమని టీఎస్వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ విమర్శించారు. అఖిలపక్ష సమావేశానికి తమను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉన్న పార్టీని ఆహ్వానించకపోవడాన్ని తప్పుపట్టారు. అఖిలపక్ష సమావేశానికి తమను పిలిచినా, పిలవకపోయినా ప్రజలపక్షాన పోరాడుతామని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.