నిజామాబాద్: రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్ల కోసమే తెలంగాణ ప్రభుత్వం 'మిషన్ కాకతీయ'ను ప్రారంభిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. గురువారం నిజామాబాద్లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కేసీఆర్ సీఎంగా పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత దాదాపు 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ... ఆ రైతుల కుటుంబాలను పరామర్శించే దమ్ము లేదని ఆయన ప్రభుత్వ నేతల తీరును దుయ్యబట్టారు.
తెలంగాణ బడ్జెట్లో పసలేదని... రైతులను చిన్న చూపు చూశారని షబ్బీర్ అలీ విమర్శించారు. అవినీతి సహించనన్న సీఎం కేసీఆర్కు రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణ కనబడటం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రకటించినట్లు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే తానే స్వయంగా వెళ్లి ఆయనకి పూలమాల వేస్తానని...లేదంటే ప్రభుత్వంతో అమీతుమీ తెల్చుకునేందుకు దేనికైనా సిద్ధమని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.