
'మానవత్వం లేని మనిషి కేసీఆర్'
హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి టి.రాజయ్య వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్పై టీటీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్శింహులు శుక్రవారం నిప్పులు చెరిగారు. కేసీఆర్ మానవత్వం లేని మనిషి అని ఆయన ఆరోపించారు. రాజయ్యను మంత్రి పదవి నుంచి దుర్మార్గంగా తొలగించారని విమర్శించారు.
రాజయ్యను మంత్రి పదవి నుంచి అవమాన పరిచే విధంగా తొలగించారని ఆరోపించారు. రాజయ్యకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మోత్కుపల్లి నర్సింహులు... తెలంగాణ సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు.