రాజకీయాలకు అతీతంగా పని చేయాలి: కేసీఆర్ | kcr visits dattatreya house in newdelhi | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు అతీతంగా పని చేయాలి: కేసీఆర్

Published Thu, Sep 22 2016 1:35 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

kcr visits dattatreya house in newdelhi

న్యూఢిల్లీ : కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకువచ్చే అంశంతోపాటు రాష్ట్రానికి కేంద్ర సహాయం అందించే విషయంలో చొరవ చూపాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గురువారం న్యూఢిల్లీలో తన నివాసంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ ఇచ్చిన విందుకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రయోజనాల విషయంలో పార్టీలకు,  రాజకీయాలకు అతీతంగా పని చేయాలన్నారు.

అలాగే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందించే సాయం సకాలంలో అందాలని పేర్కొన్నారు. రామగుండం ఫర్టిలైజర్స్ ప్లాంట్ పునరుద్దరణకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు కేసీఆర్ వెల్లడించారు. బుధవారం కేంద్రమంత్రి ఉమా భారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సెల్లో చర్చకు వచ్చిన పలు అంశాలను బండారు దత్తాత్రేయకు కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement