
'పాలమూరును కేసీఆర్ విస్మరించారు'
మహబూబ్నగర్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరందించిన పాలమూరు జిల్లాను సీఎం కేసీఆర్ విస్మరించారని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయించడమే లక్ష్యంగా నాగం శనివారం నాగర్కర్నూలు మండలం గుడిపల్లి గట్టు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా నాగం మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టి అబద్దాలు మాట్లడటం మానుకోవాలని ఆయన మంత్రులకు హితవు పలికారు.