హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మంగళవారం కూడా వాయిదా తీర్మానం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఆ పార్టీ నేతలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారితో భేటీ కానున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సదరు పార్టీ నేతలు స్పీకర్కు విజ్ఞప్తి చేయనున్నారు.
అలాగే ఇదే అంశంపై గవర్నర్ను ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు కాంగ్రెస్ పార్టీ నేతలు కలవనున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ సీఎం పదవికి అనర్హుడుగా ప్రకటించాలని వారు గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు. అయితే రాష్ట్రంలో అర్హులైన పేదలకు పెన్షన్ల తొలగించడంపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం చేసింది.