కేసీఆర్ ... తన గ్రామంలో సర్టిఫికేట్ తెచ్చుకోగలడా ? | BJP MLA G. Kishan reddy takes on Telangana CM Kalvakuntla Chandrashekar Rao | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ... తన గ్రామంలో సర్టిఫికేట్ తెచ్చుకోగలడా ?

Published Fri, Aug 1 2014 1:26 PM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

కేసీఆర్ ... తన గ్రామంలో సర్టిఫికేట్ తెచ్చుకోగలడా ? - Sakshi

కేసీఆర్ ... తన గ్రామంలో సర్టిఫికేట్ తెచ్చుకోగలడా ?

హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరీపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.  ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తోందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

1956 స్థానికతపై కేసీఆర్ అయిన... తన గ్రామంలో సర్టిఫికెట్ తెచ్చుకోగలడా అంటు తెలంగాణ సీఎంను కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.  ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వాల వైఖరీ వల్ల బీసీ, ఎస్టీ, ఎస్పీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. పరిపక్వతతో ఆలోచించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్బంగా కిషన్ రెడ్డి హితవు పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement