మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్ | Telangana CM KCR reaches Komuravelli Mallanna | Sakshi
Sakshi News home page

మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్

Published Sun, Dec 21 2014 1:16 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Telangana CM KCR reaches Komuravelli Mallanna

వరంగల్: వరంగల్ జిల్లా చెర్యాల మండలం కొమరవెల్లి మల్లిఖార్జున స్వామి కల్యాణం ఆదివారం అంగరంగవైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కొమరవెల్లి మల్లన్నకు ప్రభుత్వం తరుపున ఆయన పట్టు వస్త్రాలతోపాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యారు.

అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ కొమరవెల్లి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం హెలికాప్టర్ లో కొమరవెల్లి చేరుకున్నారు. కేసీఆర్ కు  పార్టీ నేతలు, నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement