'ఓట్లు కోసమే సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్' | BJP MLA Laxman takes on TRS Party Chief K.Chandrasekhar Rao | Sakshi
Sakshi News home page

'ఓట్లు కోసమే సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్'

Published Wed, Jul 23 2014 2:39 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్

హైదరాబాద్: ముస్లిం మైనారిటీ ఓట్లు కోసం తెలంగాణ ప్రభుత్వం పాకులాడుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డా. లక్ష్మణ్ బుధవారం హైదరాబాద్లో ఆరోపించారు. అందులోభాగంగానే పాక్ ఇంటి కోడలైన టెన్నిస్ క్రీడాకారిణి సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారని విమర్శించారు. అలాగే నవాబ్ అలీ జంగ్ జయంతిని ఇంజనీర్స్ డేగా ప్రకటించారని గుర్తు చేశారు.

ఏంఐఏం మొప్పు కోసమే చార్మినార్ చిహ్నాన్ని రాజముద్రలో చేర్చారని తెలిపారు. అయితే జమ్మూ కాశ్మీర్పై నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ ఖండించారు. ఆమె వ్యాఖ్యలు బాధ్యతరాహిత్యమని ఆరోపించారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement