సాగుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం: కె.లక్ష్మణ్ | State government's neglect on the Cultivation: K. Laxman | Sakshi
Sakshi News home page

సాగుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం: కె.లక్ష్మణ్

Published Sun, Jul 3 2016 12:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సాగుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం: కె.లక్ష్మణ్ - Sakshi

సాగుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం: కె.లక్ష్మణ్

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శని వారం జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజస్థాన్ మంత్రి అరుణ్ చతుర్వేది, కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నేతలు, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

లక్ష్మణ్ మాట్లాడుతూ  రాష్ట్రం సాధించి రెండేళ్లయినా సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడే ఉన్నాయన్నారు. ప్రాణహిత, పాలమూరు ఇతర పెండింగ్ ప్రాజెక్టులు ఒక్క అడుగూ ముందుకు సాగడంలేదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement