మజ్లిస్ తీరుపై సీఎం స్పందించాలి | Lakshman comments on Cm about Majlis | Sakshi

మజ్లిస్ తీరుపై సీఎం స్పందించాలి

Published Mon, Jul 4 2016 3:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మజ్లిస్ తీరుపై సీఎం స్పందించాలి - Sakshi

మజ్లిస్ తీరుపై సీఎం స్పందించాలి

నగరంలో పట్టుబడిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని చెప్పిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై సీఎం కేసీఆర్ స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

 హైదరాబాద్ : నగరంలో పట్టుబడిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని చెప్పిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై సీఎం కేసీఆర్ స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మతంతో సంబంధం లేకుండా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్నా రు. పాలకుల నిర్లక్ష్యం వల్లే అల్లరి మూకల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయన్నారు.

గత ప్రభుత్వాల మాదిరే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఎంఐఎం పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కాపాడిన ఎన్‌ఐఏ అధికారులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుండటంపై ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయన్నారు. దీనిపై సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి విన్నవిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement