'30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ' | Revanth Reddy takes on Telangana CM K Chandrasekhar rao | Sakshi
Sakshi News home page

'30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ'

Published Sat, Jul 26 2014 1:41 PM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

'30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ' - Sakshi

'30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ'

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికే అధిక ప్రాధాన్యమిచ్చారని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు. శనివారం హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దక్షిణ తెలంగాణ మంత్రులను తన కేబినెట్లోకి తీసుకోకుండా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.

తెలంగాణలో ఓ ప్రాంతానికి అధిక ప్రాధాన్యమిచ్చి మరో ప్రాంతంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం సబబు కాదని కేసీఆర్కు రేవంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దక్షిణ తెలంగాణ 30వ రాష్ట్రంగా ఏర్పడుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement