తెలంగాణ కోసం పోరాడిన వారిపై కేసులా ? | Mallu batti vikramarka takes on telangana cm kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణ కోసం పోరాడిన వారిపై కేసులా ?

Published Fri, Apr 3 2015 1:10 PM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

తెలంగాణ కోసం పోరాడిన వారిపై కేసులా ? - Sakshi

తెలంగాణ కోసం పోరాడిన వారిపై కేసులా ?

హైదరాబాద్: తెలంగాణ కోసం పోరాడిన వర్గాలను కేసీఆర్ సర్కార్ రాజ్యహింసకు గురి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ... కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం పోరాడిన వర్గాలను కేసీఆర్ సర్కార్ రాజ్యహింసకు గురి చేస్తుందని ఆరోపించారు.

విమలక్కపై తప్పుడు కేసులను బనాయించిందని ఆయన విమర్శించారు. సాగునీరు అడిగిన ఐదుగురు ఖమ్మం జిల్లా రైతులపై కేసీఆర్ సర్కార్ అక్రమ కేసులు పెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు లొంగరన్నారు. ఇటువంటి అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని భట్టి ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ను డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement