సీఎం క్యాంపు ఆఫీసు వద్ద కలకలం
సికింద్రాబాద్: పంజాగుట‍్టలోని తెలంగాణ ముఖ‍్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద‍్ద మంగళవారం ఒక రైతు పురుగుల మందు తాగి ఆత‍్మహత్యాయత‍్నం చేయడం కలకలం సృష్టించింది. గద్వాల జోగులాంబ ప్రాంతానికి చెందిన మల్లేష్ అనే రైతు ఐదు సార్లు బోరు వేసినా నీళ‍్లు పడకపోవడంతో రెండు లక్షలకు పైగా అప్పుల‍్లో కూరుకుపోయాడు. ఆర్థిక ఇబ‍్బందులతో బాధపడుతున‍్న మల్లేష్ ముఖ‍్యమంత్రిని కలవాలని మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం వద‍్దకు వచ్చాడు.
అక‍్కడున‍్న పోలీసులు రైతును అడ్డుకున్నారు. దీంతొ ఆవేదన చెందిన రైతు తన వెంట తెచ్చుకున‍్న పురుగుల మందు తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే రైతును గాంధీ ఆస‍్పత్రికి తచరలించారు. ప్రస్తుతం మల్లేష్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.