రెండో రోజు ప్రారంభమైన చండీయాగం | Ayutha Chandiyagam second day in Medak Dist | Sakshi
Sakshi News home page

రెండో రోజు ప్రారంభమైన చండీయాగం

Published Thu, Dec 24 2015 8:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

రెండో రోజు ప్రారంభమైన చండీయాగం - Sakshi

రెండో రోజు ప్రారంభమైన చండీయాగం

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఉదయం 8.00 గంటలకు ఈ యాగం ప్రారంభమైంది. యాగంలో భాగంగా ఈరోజు గురు ప్రార్థన, గోపూజ, ద్విసహస్ర చండీ పారాయణం... కోటి సహస్రనామ పూజ, మహాధన్వంతరీ యాగం, శ్రీచక్ర పూజను రుత్వికులు నిర్వహించనున్నారు.

ఈ రోజు ఈ యాగానికి కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జె. చలమేశ్వర్ హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో అయుత చండీయాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాగం బుధవారం ప్రారంభమైంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement