మిషన్ కాకతీయకు కేంద్రమంత్రి ప్రశంస
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సోమవారం ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంపై కేంద్రమంత్రితో చర్చించారు. కేసీఆర్ వెంట ఎంపీ కవిత, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కృష్ణా వాటర్ బోర్డు అంశంపై తెలంగాణ అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉమాభారతి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ మంచి కార్యక్రమమని ఆమె ప్రశంసించారు. మిషన్ కాకతీయ పనులను పరిశీలించేందుకు వెళ్తానని ఈ సందర్భంగా ఉమా భారతి చెప్పారు.
ఈ రోజు కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంట్లో మోదీని కలసి తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలను చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా కేసీఆర్ సమావేశమయ్యారు.