త్వరలో కేసీఆర్ జిల్లాల పర్యటన | telangana cm kcr districts tours from adilabad | Sakshi
Sakshi News home page

త్వరలో కేసీఆర్ జిల్లాల పర్యటన

Published Tue, Dec 1 2015 7:57 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

త్వరలో కేసీఆర్ జిల్లాల పర్యటన - Sakshi

త్వరలో కేసీఆర్ జిల్లాల పర్యటన

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరలో జిల్లాలలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. కేసీఆర్  మంగళవారం హైదరాబాద్లో  ఆదిలాబాద్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఆయన  ఈ సందర్భంగా  ఎమ్మెల్యేల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.  ఆదిలాబాద్ నుంచే జిల్లాల పర్యటనను ప్రారంభిస్తానని.. ఒక్కో జిల్లాలో వారం రోజులు ఉండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని  కేసీఆర్ తెలిపారు.

అన్ని మండల కేంద్రాల నుంచి ఆదిలాబాద్కు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మంచిర్యాల, చంద్రాపూర్ నాలుగు లైన్ల రహదారి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కొమురం భీమ్ వారసులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని కేసీఆర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement