'కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానిస్తోంది' | Ponnala Lakshmaiah takes on telangana cm kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానిస్తోంది'

Published Sat, Oct 18 2014 12:31 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

'కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానిస్తోంది' - Sakshi

'కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానిస్తోంది'

హైదరాబాద్: రేషన్, పింఛన్ కార్డుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానిస్తోందని టీపీసీసీ చీఫ్ పొన్నాల ఆరోపించారు. శనివారం హైదరాబాద్ గాంధీ భవన్లో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా అంజయ్యకు పొన్నాల ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పొన్నాల మాట్లాడుతూ... రేషన్, పింఛన్ కార్డులపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు మారినంత మాత్రాన ప్రజల కులాలు మారతాయా ? అని కేసీఆర్ ప్రభుత్వాన్ని పొన్నాల సూటిగా ప్రశ్నించారు.

వితంతు పింఛన్ల కోసం మహిళలెవరైనా తమ భర్తలు చనిపోయారని అబద్దాలు చెబుతారా ? అని కేసీఆర్ను ఈ సందర్భంగా నిలదీశారు. తెలంగాణ బిడ్డలు పింఛన్ల కోసం అబద్ధాలు చెప్తున్నట్లుగా కేసీఆర్ సర్కార్ భావించడం సరికాదని అన్నారు. సంక్షేమ పథకాల విషయంలో ప్రజలను ఇబ్బంది పెడితే వారు తిరిగి ప్రశ్నించే పరిస్థితి వస్తుందని కేసీఆర్ సర్కార్ను పొన్నాల హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement