కేసీఆర్కు ధైర్యం లేదని మరోసారి రుజువైంది: లోకేష్ | KCR has no guts, says Nara Lokesh | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు ధైర్యం లేదని మరోసారి రుజువైంది: లోకేష్

Published Fri, Oct 10 2014 4:08 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

కేసీఆర్కు ధైర్యం లేదని మరోసారి రుజువైంది: లోకేష్ - Sakshi

కేసీఆర్కు ధైర్యం లేదని మరోసారి రుజువైంది: లోకేష్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో చర్చించేందుకు కేసీఆర్కు ధైర్యంలేదని రుజువైందని అన్నారు. సమయం వృధా చేయాడానికే చంద్రబాబుతో చర్చలకు తమ మంత్రులను పంపుతామంటున్నారని కేసీఆర్ను ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారని లోకేష్ విమర్శించారు. ఈ మేరకు లోకేష్ శుక్రవారం ట్వీట్టర్లో పేర్కొన్నారు.

అయితే తెలంగాణలోని పలు అంశాలపై చంద్రబాబుతో చర్చకు రావాలని లోకేష్ గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. దీనిపై తెలంగాణ మంత్రులు జగదీశ్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుతో చర్చకు తాము సిద్ధమేనని ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అదికాక తెలంగాణలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కారు ఎక్కేస్తున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే తలసాని, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ తీర్థం తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement