‘అర్థం కాకపోతే మళ్ళీ వినండి’.. లోకేష్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ | YSRCP MP Vijayasai Reddy Fires On Minister Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘అర్థం కాకపోతే మళ్ళీ వినండి’.. లోకేష్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్

Published Wed, Jul 17 2024 10:11 AM | Last Updated on Wed, Jul 17 2024 1:30 PM

YSRCP MP Vijayasai Reddy Fires On Minister Nara Lokesh

సాక్షి, తాడేపల్లి: ‘‘నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు.. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి’’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా  మంత్రి నారా లోకేష్‌పై మండిపడ్డారు.

‘‘మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత ఇరవై నెలల మీ వీడియోలు మీరే చూసుకోండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా?’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

అర్థం కాకపోతే మళ్లీ విను లేదంటే నేను నేర్పిస్తా..

 

‘‘అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు.. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది?’’ అంటూ మంత్రి నారా లోకేష్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ‘‘మీరు రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ.. కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని వారి కుటుంబాల్ని గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తూ దాని దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన?’’ అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement