సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'గాల్వన్‌లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పు లేదు. కానీ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు..?. 1,200 మంది అమరులైనారని ఉద్యమంలో గొంతు చించుకున్నమీరు.. అధికారంలోకి వచ్చాక మీకు కొందరే అమరులెందుకయ్యారు?.
నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న వందల మంది నిరుద్యోగులను ఎందుకు ఆదుకోరు?. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వేల మంది రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోరు?. కనీసం నష్టపోయిన పంటకు పరిహారం ఎందుకివ్వరు?. సొంత రాష్ట్రం వారిని అల్లం, బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్‌కు బాట?' అంటూ వైఎష్ షర్మిల సీఎం కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
చదవండి: (మాటల యుద్ధంలో మరో అంకం)
Comments
Please login to add a commentAdd a comment