
'కేసీఆర్ కుటుంబంపైనే 420 కేసు పెట్టాలి'
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్పై టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయం మోసాలతోనే ప్రారంభమైందని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పి ... ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ ఆ విషయాన్ని పక్కన పెట్టారని గుర్తు చేశారు.
కేంద్రమంత్రిగా ఉండి కూడా తెలంగాణను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ పరువును కేసీఆర్ ఢిల్లీలో తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం పేరుతో జేఏసీ, కోదండరామ్లను ఉపయోగించుకుని... ఆ తర్వాత వారిని వదిలేశారని అన్నారు. ప్రస్తుతం జేఏసీ, కోదండరామ్ ఇప్పుడు ఎక్కడున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ను ఎర్రబెల్లి ప్రశ్నించారు.