
'కేసీఆర్ కుటుంబమే అసెంబ్లీని నడిపిస్తోంది'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబమే అసెంబ్లీని నడిపిస్తోందని టీటీడీపీ శాసనసభ పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఎర్రబెల్లి అసెంబ్లీలో మాట్లాడుతూ... అసెంబ్లీలో మాట్లాడకుండా అధికార పక్షం తమ గొంతు నొక్కేస్తుందని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
సభలో అధికార పక్షం అనుసరిస్తున్న వైఖరిని ఎర్రబెల్లి ఈ సందర్బంగా నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఏదైనా అంశంపై గట్టిగా అధికాపక్షాన్ని నిలదీస్తే సభ నుంచి ప్రతిపక్షాల సభ్యులను సస్పెండ్ చేస్తున్నారని తెలిపారు. సభలో ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా నోరు నొక్కేస్తున్నారన్నారు. సభా హక్కులను ఎవరు ఉల్లంఘిస్తున్నారో సభ్యులందరికి తెలుసునని ఎర్రబెల్లి అన్నారు.