'నిజాం చాలా గొప్పరాజు' | Nizam of hyderabad is a good king, says Telangana cm kcr | Sakshi
Sakshi News home page

'నిజాం చాలా గొప్పరాజు'

Published Thu, Jan 1 2015 6:43 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'నిజాం చాలా గొప్పరాజు' - Sakshi

'నిజాం చాలా గొప్పరాజు'

హైదరాబాద్: నిజాం చాలా గొప్పరాజు అని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ప్రాజెక్టులు అన్నీ ఆయన నిర్మించినవేనని కేసీఆర్ గుర్తు చేశారు. గురువారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 75వ నుమాయిష్ను కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే గొప్పగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ను అభివృద్ధి చేస్తామన్నారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ స్థలం వారంలోగా సొసైటీకి అప్పగిస్తామని చెప్పారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎలాంటి కట్టడాలు నిర్మించవద్దని సూచించారు. హైదరాబాద్లో ఎవరైనా బతకవచ్చని... అందరిని అక్కున చేర్చుకుంటామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై త్వరలో జంట నగరాల ప్రజలతో ముఖాముఖీ నిర్వహిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement