
'సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు జరపలేదు'
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా నిర్వహించకపోవడం పట్ల కేసీఆర్ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లో చాడ వెంకట్రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... విమోచన దినం నిర్వహించక పోవడానికి గల కారణాలేంటో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, భూ పంపిణీలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మెట్రో రైటు ప్రాజెక్టు తర్వగా పూర్తి చేయాలని చాడ వెంకట్రెడ్డి అన్నారు.