
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాలనే న్యాయమైన కోరికను తప్పుబట్టడ మేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీని నడిపించబోమంటూ పరో క్షంగా సీఎం కేసీఆర్ బెదిరింపులకు దిగడం సరికాదని బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. కార్మికులను బెదిరించే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వేతనాలు పెంచాలని అడిగినందుకు సంస్థనే మూసేస్తామ ని బెదిరించడం కేసీఆర్ అహంకారానికి నిదర్శ నమని విమర్శించారు.
ఆర్టీసీ నష్టాలకు కార్మికులను కారణంగా చూపించి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటోందని ఆరోపించారు. గత్యంతరం లేకే ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసును ఇచ్చారని తెలిపారు. పంతానికి పోకుండా కార్మికులతో చర్చలు జరిపి, శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని చాడ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment