సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శాసనసభ విలువల్ని కాలరాస్తూ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు పార్టీ ఫిరాయింపుదారుల సభ తప్ప ప్రజాస్వామ్య సభ కాదని ఆయన వ్యాఖ్యానించారు. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్‌కు ఆయన సవాలు విసిరారు. ఖాజీపూర్ వక్ఫ్ భూములు స్వాధీన అంశంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై ప్రత్యక్ష పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతల్లా వ్యవహరిస్తున్నాయని చాడ ధ్వజమెత్తారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్య కూటమి ఏర్పాటు అవసరం ఉందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment