Ts assembly
-
‘రాజకీయాల నుంచి తప్పుకుంటే.. గోవా వెళ్తా.. ఎంజాయ్ చేస్తా’
సాక్షి, హైదరాబాద్: తనకు గోవాలో హోటల్ ఉందని.. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. శుక్రవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, మనిషి జీవితం ఒకేసారి వస్తుందని..ఎంజాయ్ చేయాలన్నారు తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అడుగుతున్నా.. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే రేవంత్‌ను పట్నం మహేందర్ కలిశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి చేరికకు ముందే మహేందర్ కర్చీఫ్ వేశారు. జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే నా పేరు వాడుకుంటున్నారు. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి.. రేవంత్‌ను పొగుడుతున్నాడు. మల్లారెడ్డి పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు. గతంలో రేవంత్‌రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయి’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. సబితారెడ్డితో కేటీఆర్ భేటీ అసెంబ్లీలో సబితారెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి పార్టీ వీడితే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డిలు.. సీఎంను కలవడంపై చర్చాంశనీయంగా మారింది. జిల్లాలో పార్టీ పరిస్థితి పై చర్చించినట్లు సమాచారం ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం -
మెదటిసారిగా ఓటేసిన ఆనందంలో యువతులు (ఫొటోలు)
మెదటిసారిగా ఓటేసిన ఆనందంలో యువతులు (ఫొటోలు) -
బీజేపీవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని !
సాక్షి, రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. 115 స్థానాలకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 9 స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలో చోటు దక్కని నేతలు కేసీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆశతో పార్టీ మారేందుకు యత్నిస్తున్నారు. ప్రత్నామ్నాయ బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతలతో చర్చలు జరుపుతున్నాయి. ఇక అనుకున్నట్టుగానే వేములవాడ చెన్నమనేనికి కాకుండా పోయింది. అంతా భావించినట్టుగానే చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల చైర్మన్ చల్మెడ లక్ష్మీనర్సింహారావుకే దక్కింది. అయితే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దారెటు..? బీఆర్ఎస్ లోనే ఉంటూ చల్మెడ కోరినట్టుగా ఆయనకు సహకరిస్తారా..? లేక, ఇంకో మార్గమేదైనా చూసుకుంటారా..? చెన్నమనేని రాజకీయ వారసత్వానికి కామానో.. లేక, ఫుల్ స్టాప్ పడేందుకు ఆయన సుముఖంగా ఉంటారా..? టిక్కెట్ కొట్లాటకు ముందు ఎంత ఉత్కంఠైతే నెలకొందో.. అదే ఆసక్తి టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా వేములవాడలో కనిపిస్తోంది. చదవండి: వామపక్షాలతో పొత్తులేదని తేల్చేసిన కేసీఆర్.. కమ్యూనిస్టుల కీలక భేటీ వేములవాడ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు అంతా ఊహించినట్టుగానే ఈసారి టిక్కెట్ దక్కలేదు. అందుకోసం గులాబీబాస్ కేసీఆర్ చెప్పిన కారణం.. చెన్నమనేనిపై వేములవాడ కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఎప్పట్నుంచో పోరాటం చేస్తూ కోర్టుల్లో రచ్చరచ్చగా మారి ద్వంద్వ పౌరసత్వ వివాదమే. అయితే, అది ఆయన్ను పక్కకు పెట్టేందుకు కేవలం సాకు మాత్రమేనని వాదనా ఇప్పుడు రమేష్ బాబు వర్గం నుంచి వినిపిస్తోంది. అలాగైతే.. 2014, 2018కి ముందు నుంచే ఈ వివాదం కొనసాగుతున్నప్పుడు.. అప్పుడెలా మరి రమేష్ బాబు అధికార బీఆర్ఎస్ అభ్యర్థయ్యారో చెప్పాలన్న వాదన ఇప్పుడు రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం నుంచి వినిపిస్తోంది. అయితే గతంలో తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన వేములవాడ.. చెన్నమనేని ఫ్యామిలీకి ఓ కంచుకోటగా మారిపోయింది. ఈసారి తమ ప్రాతినిథ్యమే లేకపోతే.. అది కామాగా భావించాలని ఎవరైనా చెప్పినా.. ఆ తర్వాత అదే పూర్తిగా ఫుల్ స్టాప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మరొకరు వచ్చి జెండా పాతారంటే.. కచ్చితంగా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలోనే రమేష్ బాబు వేములవాడలో తన తదుపరి భవిష్యత్ కార్యాచరణకై సీరియస్ గా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తా: రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు పైగా నిన్న తనకు టిక్కెట్ దక్కదన్న ప్రచారం నేపథ్యంలోనే.. కేసీఆర్ ప్రకటన కంటే ముందే ఓ భావోద్వేగంతో.. ఒకింత నిర్వేదంతో తన తండ్రి మాటలను ఉటంకిస్తూ.. ఆత్మగౌరవం అనే పదాన్ని వాడుతూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆయన అంతరగాన్ని తెలియజెప్పింది. ఈ క్రమంలో అనుకున్నట్టుగానే వేములవాడ టిక్కెట్ ను కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న చల్మెడకు కేటాయించడంతో వేములవాడలో ఒకవైపు చల్మెడ అనుచరుల్లో ఆనందం కనిపిస్తే.. ఇంకోవైపు ఒకింత నైరాశ్యం, మరింత స్తబ్దత వాతావరణం కనిపించింది. తన తండ్రి నుంచి కొనసాగుతూ వస్తున్న రాజకీయ వారసత్వాన్ని వదలుకోవడానికి చెన్నమనేని ఫ్యామిలీ సిద్ధంగా లేదన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బాబాయ్ అబ్బాయ్ తో పాటు.. చెన్నమనేని ఫ్యామిలీ సభ్యుల్లో కీలకమైనవారంతా వేములవాడలో నెక్స్ట్ జరుగబోయే రాజకీయమెలా ఉండబోతోంది.. తామేం చేయాలనే సమాలోచనల్లో పడ్డట్టుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే బీజేపి ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్.. చెన్నమనేనితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జర్మనీలో ఉన్న రమేష్ బాబు.. ఈనెల ఆగస్ట్ 25వ తేదీన వేములవాడకు రానున్నారు. మొత్తంగా రమేష్ బాబు చూపు కూడా బీజేపీ వైపు పడినట్టుగా తెలుస్తోంది. అందుకు తన బాబాయ్ సపోర్ట్ తో పాటు.. ఈటెల కూడా చొరవ తీసుకోవడంతో.. వేములవాడ నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న యోచనలో రమేష్ బాబు కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నర్సాపూర్‌లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం పెద్దలకు కూడా ఈటెల చేరవేసినట్టు తెలుస్తుండగా.. మరి రమేష్ బాబు పయనమెటు...? ప్రచారం జరుగుతున్నట్టుగా ఆయన బీజేపీలో చేరతారా...? ఈసారి తన టిక్కెట్ కు గండికొట్టే సాకుగా మారిన ద్వంద్వ పౌరసత్వ వివాదాన్నీ.. కేంద్రంలో ఉన్న పార్టీతో కలిస్తే ఏమైనా తొలగించుకునే అవకాశం దొరుకుతుందా వంటి పలు విశ్లేషణలతో కూడిన చర్చలకు ఇప్పుడు తెర లేస్తోంది. మొత్తంగా టిక్కెట్ కన్ఫర్మేషన్కు ముందు రసవత్తరంగా సాగిన రాజన్న క్షేత్రంలోని రాజకీయం.. టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా అంతకంతకూ రసకందాయంగా మారుతుండటం ఇక్కడి విశేషం. -
రేఖా నాయక్ తిరుగుబాటు..కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రాజకీయ సమీకరణాలను మారుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో వారిలో ఒకరైన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ కానున్నారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ ఈ పరిణామాల్లో భాగంగానే.. ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనకు ఆసిఫాబాద్ టికెట్టు ఖరారైనట్లు సమాచారం. రేఖా నాయక్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి వెంటనే బీఆర్ఎస్లో చేరారు. ఇలావుండగా బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌కు కూడా ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. -
TS Election 2023: ఒక స్థానం మినహా అన్ని స్థానాల నుంచి సై.. బీఆర్ఎస్ టీమ్!
ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగేందుకు బీఆర్ఎస్ టీమ్ సిద్ధమైంది. అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. మారిన రాజకీయ సమీకరణలు, సర్వేల ఆధారంగా సిట్టింగ్‌లకు, మిగతా చోట్ల గతంలో పోటీ చేసిన వారినే మళ్లీ బరిలోకి దింపేలా నిర్ణయం జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం వైరా మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో మార్పులు లేకుండా టికెట్లు ఖరారు చేసినట్లు సమాచారం. వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ను పక్కన పెట్టి సర్వేల ఆధారంగా బానోతు మదన్‌లాల్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈనెల 21న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ప్రకటించే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని ఒక స్థానం మినహా అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగే వారి పేర్లు వెల్లడవుతాయని సమాచారం. అయితే, ప్రాథమికంగా జాబితా ఖరారైనా చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఒక్కరు మినహా సిట్టింగ్‌లకు సై.. తాజా సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఒక్కరు మినహా బీఆర్ఎస్లోని సిట్టింగ్‌లకు టికెట్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరు నుంచి కందాల ఉపేందర్‌రెడ్డి, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, పినపాక నుంచి రేగా కాంతారావు, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు నుంచి బానోతు హరిప్రియ, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు మళ్లీ బరిలో దిగనున్నట్లు తెలిసింది. అలాగే, మధిర, భద్రాచలం నుంచి గతంలో పోటీ చేసిన ఓడిపోయిన లింగాల కమల్‌రాజు, తెల్లం వెంకట్రావు పోటీకి దిగనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో జరిపిన చర్చల్లో ఈ విషయమై స్పష్టత వచ్చింది. పలుమార్లు చేయించిన సర్వేల ఆధారంగా వీరే బలమైన అభ్యర్థులుగా తేలడంతో పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. రెండు స్థానాలపై ఆచితూచి.. ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు నుంచి బానోతు హరిప్రియనే పోటీలో దింపేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలుపొంది బీఆర్ఎస్లో చేరిన వీరికి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యాన మళ్లీ పోటీకి సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. ఇల్లెందులో గ్రూపుల కారణంగా సిట్టింగ్‌పై వ్యతిరేకత ఉన్నా ప్రతిపక్ష పార్టీకి హరిప్రియ మాత్రమే పోటీ ఇవ్వగలరనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు సమాచా రం. అయితే, ఈ స్థానానికి సంబంధించి చివరి నిమిషంలో మార్పులకు అవకాశం లేకపోలేదన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికైతే భద్రాచలం ఓకే.. కాంగ్రెస్ నుంచి ఇటీవల బీఆర్ఎస్లో చేరిన తెల్లం వెంకట్రావే పార్టీ అభ్యర్థిగా ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం, సీపీఐతో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఎంకు కేటాయించి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెల్లంకు ఉన్నత పదవి కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఉభయ కమ్యూనిస్టులతో పొత్తుపై బీఆర్ఎస్ ఎటూ తేల్చకపోగా, తొలి జాబితా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యాన చర్చలు ఎప్పుడు జరుగుతాయో తెలియడం లేదు. తొలి జాబితా విడుదలయ్యేలోగా రెండు పార్టీలతో చర్చలు మొదలైతే భద్రాచలం స్థానాన్ని పెండింగ్‌లో పెట్టే అవకాశముంది. ఏదిఏమైనా కొన్ని నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు అధిష్టానం త్వరలోనే తెరదించనుంది. రాములునాయక్‌కు షాక్.. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలపై కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం వైరా నుంచి సిట్టింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ఎమ్మెల్యే రాములు నాయక్‌ను కాదని బానోత్ మదన్‌లాల్‌ను బరిలో దింపాలని సర్వేల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నారు. రాములునాయక్ గత ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాక బీఆర్ఎస్లో చేరారు. బానోత్ మదన్‌లాల్ గత రెండు పర్యాయాలు వైరా నుంచి పోటీ చేయగా.. 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018లో పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయితే, ప్రస్తుతం చేయించిన సర్వే ఆధారంగా మదన్‌లాల్ వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. -
సీఎం కేసీఆర్‌పై ఈటెల రాజేందర్ మండిపడ్డారు
-
సభ ముందుకు ఏడు బిల్లులు.. ఈటెలపై చర్యలకు పట్టు?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న సమావేశమై వాయిదా పడిన తెలంగాణ శాసనసభ, శాసన మండలి వానాకాలం సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆరో తేదీన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నెల 12, 13 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సోమవారం ఏడు బిల్లులు, పలు పత్రాలు సభ ముందుకు రానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే 6న జరిగిన బీఏసీ సమావేశం నివేదికను సీఎం కేసీఆర్ సభకు సమర్పిస్తారు. అనంతరం తెలంగాణ సదరన్ డిస్కమ్, ట్రాన్స్‌కో, టీఎస్ రెడ్కో వార్షిక నివేదికలు, తెలంగాణ సమగ్ర శిక్షా 2020–21 ఆడిట్ రిపోర్ట్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రెగ్యులేషన్స్ పత్రాలను సంబంధిత శాఖల మంత్రులు సభకు సమర్పిస్తారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు మృతిపై స్పీకర్ స్థానం నుంచి సంతాప ప్రకటన ఉంటుంది. జీఎస్టీ సవరణ బిల్లుతో పాటు.. తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2022, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా బిల్లు 2022, తెలంగాణ మున్సిపల్ చట్టాలు 2022 సవరణ బిల్లు సభ ముందుకు వస్తాయి. వీటితో పాటు తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు, తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, తెలంగాణ మోటారు వాహనాల టాక్సేషన్ సవరణ బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు సమర్పిస్తారు. శాసనసభ, మండలిలో ‘కేంద్ర విద్యుత్ బిల్లు.. పర్యవసానాలు అంశం’పై స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. ఈటలపై చర్యలకు అధికార పక్షం పట్టు? బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులను ఆహ్వానించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ సభ్యులు ప్రస్తావించే అవకాశం ఉంది. సభ్యుల ప్రవర్తనా నియమావళికి ఈటల వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటలపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ సభ్యులు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Krishnam Raju: రారాజు ఇకలేరు -
టార్గెట్ అసెంబ్లీ.. శాసనసభకు పోటీ చేయడానికే మొగ్గుచూపుతున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కీలక కాంగ్రెస్ నేతలంతా ఈసారి శాసనసభకు ఎన్నికయ్యేందుకే ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎంపీలుగా పోటీ చేసి న వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి పోటీ చేయా లనే ఆలోచనలోనే ఉన్నారు. ఈ మేరకు తమ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు పరిస్థితులను చక్కబెట్టుకుంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ, భువనగిరి, మల్కాజ్గిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలతో పాటు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఫలితాలు తమకు సానుకూలంగా వస్తాయని, రాష్ట్రం వచ్చిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరిస్తారనే ఆలోచనతోనే వీరంతా అసెంబ్లీ వైపు మొగ్గుచూపుతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మధిరలో ‘పట్టు వదలని విక్రమార్కుడు’ నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా, రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా తెచ్చుకునే ప్రయత్నాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముందు వరుసలో ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే ఆయన మూడు విడతలుగా నియోజకవర్గంలో పర్యటించారు. ‘పీపుల్స్ మార్చ్’పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల్లో 400 కిలోమీటర్ల మేర 86 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఎర్రుపాలెం మండలం మినహా నియోజకవర్గంలో ని మిగిలిన మండలాల్లో ఆయన గ్రామగ్రామానికి వెళ్లి ఓ వైపు ప్రజాసమస్యలను తెలుసుకోవడం, తా ను చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు పార్టీ కేడర్‌ను ఉత్తేజితులను చేసే ప్రయత్నం చేశారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ స్పీడు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ బాట పడుతున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించడమే ధ్యేయంగా ఈ నెల 21 నుంచి ఆయన యాత్ర చేపట్టారు. టీపీసీసీ పిలుపులో భాగంగా పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో గత ఐదురోజుల్లోనే 40 గ్రామాల్లో పర్యటించారు. ఎండను లెక్క చేయకుండా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైతు రచ్చబండలు, సభల్లో పాల్గొంటున్నారు. వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించడంతో పాటు నియోజకవర్గంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ ప్రజల సమస్యలను వారికి వివరిస్తున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ కేడర్‌తో కూడా సమావేశమవుతున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలతో వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ సమాచారం పంపించడం, కార్యక్రమాలు విజయవంతం చేసేలా పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేయడం కోసం ఈ గ్రూపులను ఉపయోగించుకో వాలనేది ఉత్తమ్ ఆలోచనగా చెబుతున్నారు. శివారు నియోజకవర్గంపై యాష్కీ కన్ను ఇక గతంలో నిజామాబాద్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఈసారి హైదరాబాద్ శివార్లలోని ఓ అసెం బ్లీ నియోజకవర్గంపై కన్నేసినట్టు చర్చ జరుగుతోంది. తన సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానంపై ఆయన గురిపెట్టారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి ఎప్పటిలాగే జగిత్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరితో పాటు ఇప్పటికే అసెంబ్లీ ఇన్చార్జులుగా ఉన్నవారు, గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన నాయకులు పలువురు కూడా వరంగల్ డిక్లరేషన్ పేరుతో గ్రామాల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు పార్టీలో, ఇటు నియోజకవర్గంలో పట్టు సాధించే లక్ష్యంతో తమ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. నల్లగొండ నుంచి ఖాయమన్న కోమటిరెడ్డి... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషయానికొస్తే.. తాను వచ్చే ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తాన ని ఆయన ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే త్వరలో నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచనలో కోమటిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. -
హిజాబ్ వివాదం ఎందుకు?: సీఎం కేసీఆర్
హైదారబాద్: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. హిజాబ్ వ్యవహారంపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. మతకలహాలు సృష్టిస్తూ దేశాన్ని విచ్చినం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఏ దుస్తులు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. హిజాబ్ వివాదం ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. ఓవైపు దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వంపై అనేక రకాల నిందలు వేసి, ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. దేశంలో ఎదైనా పెరిగింది ఉందంటే.. అది కేవలం మత పిచ్చి మాత్రమేనని మండిపడ్డారు. వాళ్లు పెంచుతున్న మత పిచ్చి.. ఓ కార్చిర్చులా మారి దేశాన్నే దహించి వేస్తుందని దుయ్యబట్టారు. తాను దేశ యువత, దేశంలోని మేధావులకు అప్పీల్ చేస్తున్నానని.. ఇటువంటి వ్యవహారం దేశానికి మంచిది కాదని అన్నారు. మత పిచ్చి వల్ల దేశంలో నెలకొల్పబడిన వాతావరణం, దశాబ్దాల పాటు కొనసాగిన కృషి ఒక్కసారిగా కుప్పకూలుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని.. దేశంలో దారుణమైన పరిస్థితి వస్తుందన్నారు. ప్రస్తుతం దేశం అటువంటి స్థితిలోనే ఉందని అన్నారు. దేశంలో మనోత్మాదం, అల్లరి మూకదాడులు పెరుగుతున్నాయని.. దేశాన్ని నడిపే విధానం ఇదేనా? అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. CM KCR: People wear different kinds of clothes. Some wear shirts, some wear waist coats, some wear dhotis, some wear sherwanis. What does the govt have to do? It is being projected as an issue out of nothing. Where will the country go with such narrow mindedness? #HijabVerdict pic.twitter.com/8WrJaVRcss — Paul Oommen (@Paul_Oommen) March 15, 2022 -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన అనంతరం అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. ఏడు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి. 54 గంటల 47 నిమిషాలు పని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. -
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాసనసభ సమావేశాలకు అనుమతించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రశ్నించే వారిని సభకు అనుమతించినప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణం అవుతుందని పేర్కొంది. శాసనసభకు స్పీకర్ గార్డియన్ లాంటి వారని, పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. తమను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేయడంపై.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులు దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. శాసనసభ నియమావళికి విరుద్ధంగా, సహేతుకమైన కారణం లేకుండానే ఈ సెషన్ మొత్తం సభకు హాజరుకాకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని వారి తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రస్తావించారు. వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరించింది. తగిన నిర్ణయం తీసుకోండి శాసనసభ్యులను సహేతుకమైన కారణాలు లేకుండా సస్పెండ్ చేయడం వారి హక్కులను హరించడమేనని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు సహేతుకమైన కారణాలు లేవని భావిస్తున్నామంది. సస్పెండైన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ రోజే శాసనసభ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమావేశాలకు అనుమతించాల్సిందిగా కోరాలని సూచించింది. కార్యదర్శి వీరిని మంగళవారం సభకు ముందే స్పీకర్ దగ్గరికి తీసుకెళ్లాలని, వారి అభ్యర్థనను స్పీకర్ విని తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఉన్నత రాజ్యాంగ హోదా కల్గిన స్పీకర్ ఈ ఘర్షణ వాతావరణాన్ని సామరస్యంగా, న్యాయబద్ధంగా పరిష్కరిస్తారనే నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు, సాంప్రదాయాలకు అనుగుణంగా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేసి సమావేశాలకు హాజరయ్యేలా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ‘‘స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోరాదన్న సింగిల్ జడ్జి తీర్పుసరికాదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ అధికారాల్లో స్పష్టమైన విభజన రేఖ ఉంది. అయినా చట్ట నిబంధనలను ఉల్లంఘించినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు..’అని పేర్కొంది. అప్పీల్ దాఖలు చేసినట్లు తాము నోటీసులు పంపినా శాసనసభ కార్యదర్శి, శాసనసభ సెక్రటేరియట్ కార్యదర్శి తరఫున ఎవరూ హాజరుకాలేదని వ్యాఖ్యానించింది. ఎట్టకేలకు నోటీసులు తీసుకున్న కార్యదర్శి సింగిల్ జడ్జి తీర్పుపై దాఖలు చేసిన అప్పీల్‌కు సంబంధించి ప్రతివాదిగా ఉన్న శాసనసభ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం లేదంటూ ప్రకాశ్‌రెడ్డి ఉదయం విచారణ సందర్భంగా ధర్మా సనం దృష్టికి తెచ్చారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెళ్లి నోటీసులు అందజేయాలని, నగర పోలీసు కమిషనర్ ఇందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కార్యదర్శి నోటీసులు అందుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ సాయంత్రం 4 గంటల సమయంలో ధర్మాసనానికి నివేదించారు. ‘నేటి ఉదయం స్పీకర్‌ను కలుస్తాం’ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం ఉదయం 9 గంటలకు కలసి తమ సస్పెన్షన్‌పై హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందజేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ తెలిపారు. బడ్జెట్ సమావేశాలు మంగళవారమే ముగియనున్నందున ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ స్పీకర్ తమను సభలోకి అనుమతిస్తారనే విశ్వాసం ఉందన్నారు. సోమవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గౌర వించకపోతే మళ్లీ హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందుతామని చెప్పారు. తమ గొంతులు నొక్కుతామంటే ప్రజలు రాబోయే రోజుల్లో కేసీఆర్‌నే బహిష్కరిస్తారని ఈటల హెచ్చరించారు. అహంకారంతో వ్యవహరిస్తున్న రావణాసురుడిని (కేసీఆర్)ను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ ఆర్’గా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నామని చెప్పారు. -
5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనాను కట్టడి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : కరోనావైరస్(కోవిడ్-19)ను ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పెద్దగా లేదని, అయినప్పటికీ తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. శనివారం శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని.. కరోనాపై ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైతే రూ.1000 కోట్లు కాదు రూ.5000 కోట్లు ఖర్చు చేసైనా కరోనాను కట్టడి చేస్తామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కోలుకున్నాడని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. తెలంగాణలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని చెప్పారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని సభలో కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్ చెప్పారు. ‘కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్ కమిటీ చర్చిస్తోంది. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బెంగళూరులో కూడా సంస్థలను మూసేశారు. చాలా రాష్ట్రాలలో థియేటర్లు, స్కూళ్లు బంద్ చేశారు. మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా కోసం సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. డీసీపీ ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీని పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో 200 మంది స్క్రీనింగ్ చేస్తున్నారు. హైలెవల్ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుంది. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తాం’ అని కేసీఆర్ అన్నారు. దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా వైరస్ సోకగా ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారని సీఎం తెలిపారు. 65 మందిలో 10 మందిని డిశ్చార్జి చేశారని పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో కరోనాపై విస్తృతంగా చర్చిస్తామని చెప్పారు. పాఠశాలల బంద్, తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు. -
అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం
-
తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని వెనక్కు నెట్టారు.అయినప్పటికీ ఏబీవీపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 యూనివర్సీటీలకు వెంటనే వీసీలను నియమించాలని, ఖాళీగా ఉన్న 50వేల టీచర్ల పోస్టులను, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని దాని వల్ల తమకు స్కాలర్ షిప్‌లు రావడం లేదని విద్యార్థులు మీడియాకు చెప్పారు. ఈ డిమాండ్ తీర్చడం కోసమే అంతా కలిసి అసెంబ్లీ ముట్టడికి యత్నించినట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
రైతుల పక్షాన ప్రశ్నిస్తా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో సంగారెడ్డి రైతుల పక్షాన పలు అంశాలపై ప్రశ్నిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. సింగూరు-మంజీర నీళ్లు సంగారెడ్డికి అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు హరీష్ రావు మంత్రిగా కొనసాగుతున్నారని.. తాను గత అసెంబ్లీ సమావేశాల నుంచి సంగారెడ్డి కి నీళ్లు కావాలని అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సంగారెడ్డిలో హరీష్‌రావు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారని... ఆ ప్రాంతంలో 70 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు. పంటనష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. లాయర్లకు నెలకు రూ.5వేలు ఇస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. -
పోడు భూముల సంగతి తేలుస్తా
సాక్షి, హైదరాబాద్: ‘‘అడవులను రక్షించుకోవాలి. గిరిజనుల హక్కులను కూడా పరిరక్షించాలి. పోడు భూముల వ్యవహారం కూడా తేల్చేయాలి. నేనే బయలుదేరుతా.. అన్ని జిల్లాలకు అన్ని డివిజన్లకు వెళ్తా. నేనొక్కడినే కాదు మొత్తం మంత్రివర్గాన్ని అధికారగణాన్ని, అటవీశాఖ ఉన్నతాధికారులను, సీఎస్, రెవెన్యూ సెక్రటరీని తీసుకెళ్లి ఇది పోడు భూమి.. ఇది మీ పట్టా అని ఇచ్చేస్తం. ఫైనల్ చేస్తం. ఆ తర్వాత ఒక్క అంగుళం కూడా అటవీ భూమి ఆక్రమణ కానివ్వం’’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘‘పొరుగు రాష్ట్రం నుంచి గుత్తికోయలు వచ్చి అడవులను ఇష్టం వచ్చిట్లు నరికేస్తున్నరు. మన గిరిజనులు నష్టపోయే పరిస్థితి. కఠినంగా నియంత్రించాలంటే ఎక్కడ్నో ఓ కాడ భరతవాక్యం పాడాలి. ఆర్ఓఎఫ్ఆర్ కేంద్రం చట్టం నిబంధనల ప్రకారం హక్కులిస్తం. ఆ పేద గిరిజనులకు కూడా రైతు బం«ధు, రైతు బీమా రావాలి. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, స్థానిక సంస్థల ప్రతినిధులను తీసుకెళ్లి ఏ తాలుకా కేంద్రంలో సమస్య ఉంటే అక్కడే బహిరంగంగా ప్రజాదర్బార్ నిర్వహించి సమస్య పరిష్కారం చేస్తం’’అని వెల్లడించారు. కొత్త పురపాలక చట్టంపై శుక్రవారం శాసనసభలో ప్రసంగం సందర్భంగా అడవులు తరిగిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ కూడా కొనుక్కుంటామా? ‘‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల గడ్డాలు పట్టుకున్నా మొక్కలు పెట్టలేదు. నిర్లక్ష్యం విహిస్తున్నరు. మనం పెంచకపోతే అమెరికా వాడు వచ్చి పెంచడు కదా. ఏ రోజుకైనా మనకు మనమే మేలుకోవాలి. భయంకరమైన ఎండలు రావొద్దంటే, రెండు మూడు డిగ్రీల ఎండను తగ్గించాలన్నా, మన భవిష్యత్ తరాలు గొప్పగా బతకాలన్నా మనమే ఏదైనా చేయాలి. భవిష్యత్ తరాలకు బతకగల సమాజాన్ని ఇవ్వాలి. ఆక్సిజన్ కొనుక్కుంటామా అధ్యక్షా. హైదరాబాద్‌లో ఆక్సిజన్ క్లబ్స్ వస్తున్నయి. సిగ్గు చేటు. బంజారాహిల్స్‌లో నా చిన్నప్పుడు ఫ్యాన్లు కూడా ఉండకపోయేవి. అంత చల్లగా ఉండేది హైదరాబాద్. అటువంటి హైదరాబాద్ నేడు కాంక్రీట్ జంగిలైపోయి ఎయిర్ కండిషన్ లేకుండా బతకలేని పరిస్థితి’’అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
మున్సిపల్ చట్టం.. బీసీలకు నష్టం
సాక్షి, హైదరాబాద్: కొత్త మున్సిపల్ చట్టంపై విపక్ష పార్టీల సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చట్టం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, బీసీల రాజకీయ భవిష్యత్తు మరింత ఆందోళనకరంగా మారుతుందని మండిపడ్డారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం మండలిలో మున్సిపల్ చట్టం–2019ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ఈ చట్టంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను భారీగా కుదించారని, దీంతో స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం బాగా తగ్గిందన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటూ నూతన చట్టంపైనే మాట్లాడాలన్నారు. ఈ క్రమంలో జీవన్‌రెడ్డి మండలి నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ నూతన చట్టంలో కొన్ని సవరణలు చేయాలని బీజేపీ తరఫున ప్రభుత్వానికి సూచించినా స్పందన లేదన్నారు. పాలనా సౌలభ్యం కోసం రాజధాని చుట్టూ కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన మున్సిపల్ చట్టం ఆమోదం తర్వాత మండలి చైర్మన్ సభను నిరవదికంగా వాయిదా వేశారు. -
‘నోటీసులుండవు; అక్రమమైతే కూల్చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ చట్టంపై రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ‘పంచవర్ష ప్రణాళికలను ప్రజాప్రతినిధులు అధ్యయనం చేయాలి. మనది బలమైన పునాదులున్న ప్రజాస్వామ్యం. మున్సిపల్ చట్టాన్ని పారదర్శకంగా రూపొందించాం. నిధులు, అధికారాలు మున్సిపాలిటీలకే. కొన్ని అధికారాలను కలెక్టర్లకు కేటాయించాం. ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజాదర్బారు ఉంటుంది. అర్బన్ లోకల్ బాడీస్ కూడా పద్ధతిగా ఉండాలి. ప్రతియేడు రూ.3,200 కోట్ల నిధులు గ్రామాలకు వెళ్తాయి. 500 జనాభా ఉండే పంచాయతీకి కనీసం రూ.5 లక్షలు అందిస్తాం. పట్టణాలకు రూ.2,060 కోట్లు వెళ్తాయి. 500 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు మున్సిపల్ ఆఫీసుల చట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఇకపై 128 మున్సిపాలిలు ఉంటాయి. నగర పంచాయతీలు ఉండవు. మున్పిపాలిటీల్లో ఆస్తిపన్ను కట్టకుండా అబద్ధాలు చెబితే 25 రెట్ల జరిమానా విధిస్తాం. ఎన్నికల నిర్వహణలో ఈసీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కేవలం ఎన్నికల తేదీలను మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తుంది. మున్సిపల్ వ్యవస్థను అవినీతి రహితం చేయడమే లక్ష్యం. 75 చదరపు గజాల్లోపు ఉన్న ఇల్లుకు ఏడాదికి రూ.100 పన్ను చెల్లించాలి. 75 చదరపు గజాల్లోపు జీ+1 కడితే అనుమతి అవసరం లేదు. ఒక్క రూపాయితోనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎక్కడా అనుమంతించం. అక్రమ నిర్మాణమని తెలిస్తే వెంటనే కూల్చేస్తాం. ఎలాంటి నోటీసులు ఇవ్వం’అన్నారు. -
కేటీఆర్.. మీతో ఛాయ్ కా, ఇంకేమైనా ఉందా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా గురువారం అసెంబ్లీ లాబీలో అసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పద్మా దేవేందర్ రెడ్డి, బాల్క సుమన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎదురయ్యారు. కేటీఆర్ ఈ సందర్భంగా ఛాయ్ తాగుదాం రండి అంటూ శ్రీధర్‌బాబును ఆహ్వానించారు. ‘మీతో ఛాయ్‌పై చర్చనా ? ఇంకా ఏమైనా ఉందా ? వద్దు బాబు’ అంటూ శ్రీధర్ సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. అనంతరం బాల్క సుమన్‌ను పలకరించిన శ్రీధర్‌బాబు..ఏదో వన భోజనాలు పెట్టించినట్టున్నావు అని చమత్కరిస్తూ... కాళేశ్వరం జలజాతర పేరిట సుమన్ నిర్వహించిన కార్యక్రమం గురించి ఆయన ప్రస్తావించారు. తానే కాదని, మంథని నియోజకవర్గంలో కూడా గతంలో భోజనాలు పెట్టించారని బాల్క సమాధానమిచ్చారు. ఇక ఇవాళ ఉదయం శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన వెంటనే విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి సభాపతి స్థానం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా శాసనసభ్యులు జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు శాసనసభ సమావేశాలకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పుష్పగుఛ్చం అందజేసి స్వాగతం పలికారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు గౌడ్‌కు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు స్వాగతం పలికారు. -
కాంగ్రెస్ సభ్యుల నిరసన; కేసీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. పలు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడంపై కాంగ్రెస్ సభ్యులు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల నిరసనలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించారు. టీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం రాజ్యాంగబద్ధంగా జరిగిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమైన విషయాన్ని, గోవాలో కాంగ్రెస్ సభ్యులు బీజేపీలో విలీనమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారితే తమని నిందించడం సరికాదని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడిందని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై విపక్ష సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, బ్యాలెట్ విధానంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు మా పార్టీని దీవించారు. తెలంగాణలో రైతులకు ఉచితంగానే కరెంట్ ఇస్తాం. ఎన్నివేల కోట్లు ఖర్చయినా కరెంట్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది’అని కేసీఆర్ స్పష్టం చేశారు. -
రేపటి నుంచి అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి సోమవారం వరకు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శాసన సభ, శాసన మండలి లో ప్రభుత్వం తాత్కాలిక (ఓటాన్ అకౌంట్) బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆదివారం బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. సోమవారం ద్రవ్యవిని యోగ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలుపనున్నాయి. శాసన సభ, శాసన మండలి సమా వేశాల నిర్వహణకు అవసరమైన భద్రత ఏర్పాట్లపై శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పీకర్ చాం బర్లో జరిగిన ఈ సమావేశంలో మండలి చైర్మ న్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ వేము ల ప్రశాంత్‌రెడ్డి, ఎస్టీఎఫ్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, హైదరాబాద్ నగ ర పోలీస్ కమిషనర్ అంజనాకుమార్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసు అధికారులు, ట్రాఫిక్, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. పోచారం మాట్లాడుతూ... ‘శాసనసభ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25 వర కు జరుగుతాయి. మొత్తం 3 రోజులు సమావేశాలు సాగుతాయి. అందరి సహకారంతో శా సనసభ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలి’అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు పోలీసు అధికారులతో భేటీకావడం ఆనవాయితీ అని మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. సమావేశాలు ప్రశాంతంగా జరగడానికి అందరి సహకారం అవసరమని చెప్పా రు. శాసనసభ సజావుగా జరగడానికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. -
ఎన్నికల చిక్కులో రబీ ‘పెట్టుబడి’ పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రబీలో రైతుబంధు పెట్టుబడి సొమ్ము పంపిణీపై ఎన్నికల చిక్కుముడి పడి వ్యవసాయశాఖ గందరగోళ పడుతోంది. రాష్ట్ర అసెంబ్లీ రద్దుకావడం ,ఈ డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ చెబుతుండటంతో రైతులకు పెట్టుబడి సొమ్ము పంపిణీ సజావుగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. రబీ పెట్టుబడి సొమ్మును నవంబర్‌లో పంపిణీ చేస్తామని స్వయంగా సీఎం చెప్పారు. నిధులనూ మంజూరు చేశారు. అయితే అప్పటికే ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే నవంబర్‌లో రైతులకు ఈ చెక్కుల పంపిణీ ఎలా చేస్తారని పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది కొనసాగుతున్న పథకమే అయినా రైతులకు ఆర్థికంగా లబ్ధి జరుగుతున్నందున ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటుందా లేదా అన్న చర్చ వ్యవసాయశాఖలో నెలకొంది. కీలకమైన ఎన్నికల సమయంలో ప్రభుత్వం 58 లక్షల మంది రైతులకు అంటే అంతమంది ఓటర్లకు చెక్కులు పంపిణీ చేయడాన్ని ఎన్నికల కమిషన్ ఎలా తీసుకుంటుందోనని అంటున్నారు. గత ఖరీఫ్‌లో చెక్కుల పంపిణీని టీఆర్ఎస్ వర్గాలు ధూంధాంగా జరిపాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేలు లేకపోయినా టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు వీటి పంపిణీని నిర్వహిస్తే అది ఎన్నికల కార్యక్రమంలా ఉంటుందంటున్నారు. మరోవైపు ఈ పంపిణీకి ప్రతిపక్షాలు కూడా రైతులనుంచి వ్యతిరేకత రావచ్చన్న భయంతో అడ్డుకోకపోవచ్చు.ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచే రబీ సాగు మొదలు కానున్నందున నవంబర్‌కు ముందే చెక్కులు ఇస్తారనే వాదనలూ ఉన్నాయి. కార్డులుండవ్... చెక్కులే ఖరీఫ్ కోసం మొత్తం 58.16 లక్షల మంది పట్టాదారులకు 58.81 లక్షల చెక్కులు ముద్రించారు. ఇందులో 51.11 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. 7.70 లక్షల చెక్కులు పంపిణీ కాలేదు. ఇప్పుడు సాగు చేసిన వారికే కాకుండా ఖరీఫ్‌లో ఇచ్చిన వారందరికీ రబీలోనూ చెక్కులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఖరీఫ్‌లో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలైతే, రబీలో కేవలం 31.92 లక్షల ఎకరాలే. అంటే ఖరీఫ్ సాగులో మూడో వంతు కంటే తక్కువే రబీలో సాగవుతాయి. అయితే ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి, మిర్చి పంట రబీలోనూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పంటల సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా రబీలోనూ ఖరీఫ్‌లో ఇచ్చిన రైతులందరికీ పెట్టుబడి సాయం చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. బడ్జెట్లోనూ ఆ మేరకు రూ. 12 వేల కోట్లు కేటాయించింది. అయితే ఖరీఫ్‌లో ముద్రించిన చెక్కులు తీసుకోకుండా ఉన్న రైతులకు రబీలో ఇచ్చే అవకాశం లేదన్న వాదనలున్నాయి. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఇదిలావుంటే రెండో విడత రైతుబంధు సొమ్మును ఎలా పంపిణీ చేయాలన్న దానిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రబీలో చెక్కులకు బదులు బ్యాంకు కార్డులను ఇవ్వాలని గతంలో సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే చెక్కుల పంపిణీని గ్రామాల్లో పండుగగా చేయడం, చెక్కులపై ఎవరికి ఎంతెంత వచ్చిందో స్పష్టంగా కనిపించడంతో సర్కారుకు భారీ ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు కార్డులు ఇస్తే ఆ ప్రచారం వచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. కాబట్టి ఇప్పుడూ చెక్కులనే ఇస్తారంటున్నారు. ఏమైనా పెట్టుబడి సొమ్ముపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందన్న దానిపైనే పంపిణీ ఆధారపడి ఉంటుంది. అధికారుల జాబితా ఇవ్వండి: సీఈఓ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకే అధికారుల బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రత్యేకంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారు సొంత జిల్లాలో ఉండవద్దని ఆయన స్పష్టంచేశారు. ఒకే జిల్లాలో వరుసగా మూడేళ్ళుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించారు. 2018 డిసెంబర్ 31 నాటికి వరుసగా మూడేళ్లు పూర్తయ్యేవారికి ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. రోగుల ఆహార చార్జీల పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు ఇచ్చే ఆహారపదార్థాల చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు ఆహారానికి రూ.40 ఖర్చుచేస్తుండగా, ఇప్పుడు రూ.80 చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్ సాక్షి, హైదరాబాద్: ఓ కాంట్రాక్టర్ వద్ద రూ.20వేల లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజనీర్ మురళి సీబీఐ అధికారులకు చిక్కారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సీబీఐ నిర్వహించిన తనిఖీల్లో ఆయన రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. -
తొలిరోజు ‘ఆపద్ధర్మం’సాధారణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కొలువుదీరిన ఆపద్ధర్మ ప్రభుత్వం తొలిరోజు సాధారణంగా పూర్తయ్యింది. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలు అన్ని ఎప్పటిలాగే సాగాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక కార్యక్రమాలేవి జరగలేదు. సీఎంవో అధికారులకు ప్రస్తుతం ప్రగతిభవన్‌లో, సచివాలయంలోని సీ బ్లాక్‌లో రెండు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. ఆయా రోజుల్లో ఉండే సమీక్షలు, సమావేశాల ప్రకారం వీరు ప్రగతిభవన్‌కు, సచివాలయంలోని సీఎంవోకు వెళ్తుంటారు. ఆపద్ధర్మ ప్రభుత్వం తొలిరోజు సీఎంవో అధికారులు అందరూ సచివాలయానికే వచ్చారు. సచివాలయం సీ బ్లాక్‌లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల చాంబర్లు, పేషీలో అవసరమైన మార్పులను గురువారమే పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఎప్పటిలాగే ఉదయమే సచివాలయా నికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, ఎ.శాంతికుమారి, కార్యదర్శి భూపాల్‌రెడ్డి సచివాలయానికి వచ్చారు. అన్ని శాఖల్లోనూ యథావిధిగా కార్యకలాపాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మొత్తం 32 శాఖలు ఉండగా.. తొలిరోజు 10 శాఖలు మాత్రమే ఉత్తర్వులను జారీ చేశాయి. శుక్రవారం జారీ అయిన 21 జీవోల్లో కీలకమైన నిర్ణయాలేవి లేవు. సాధారణ పరిపాలన శాఖ ఐఏఎస్ అధికారి జోత్య బుద్ధ ప్రకాశ్‌ను బదిలీ చేస్తూ.. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వేతనం ఖరారుపైనా పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చాయి. ఇవి మినహా కీలకమైన అంశాలకు సంబంధించిన నిర్ణయాల ఉత్తర్వులు ఏవీ జరగలేదు. -
కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సింది శాసనసభే
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ బహిష్కరణ తీర్మానాన్ని రద్దు చేస్తూ, వారి శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది శాసనసభేనని శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు తీర్పు మేరకు కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల పునరుద్ధరణ అనేది పూర్తిగా సభ పరిధిలోని వ్యవహారమని ఆయన తెలిపారు. అందువల్ల కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల విషయంలో తాను కోర్టు ఆదేశాలను ఏ రకంగానూ ఉల్లంఘించలేదని, కోర్టు ఆదేశాలపై తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తనపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. తమ బహిష్కరణను, నియోజకవర్గాల ఖాళీ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినా కూడా తమ శాసనసభ్యత్వాలను మాత్రం పునరుద్ధరించలేదని, ఇది ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కారమే అవుతుందని, అందువల్ల అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలంటూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు తమ వాదనలను వినిపిస్తూ కౌంటర్లు దాఖలు చేశారు. ఆ అధికారం సభకే ఉంది శానససభ చేసే తీర్మానాల విషయంలో శాసనసభ కార్యదర్శికి రాజ్యాంగం ప్రకారం ఎటువంటి పాత్ర లేదని నరసింహాచార్యులు తన కౌంటర్లో పేర్కొన్నారు. ఏదైనా విషయంపై చర్చ జరిపి, నిర్ణయం తీసుకునే అధికారం సభకు మాత్రమే ఉందన్నారు. శాసనసభ సభ్యుల హక్కులు, వారికున్న రాజ్యాంగపరమైన రక్షణ విషయాలన్నీ కూడా సభ పరిధిలోనివేనన్నారు. సభ్యుల వ్యవహారశైలిపై నిర్ణయం సభదే అవుతుందని తెలిపారు. సభ తీర్మానం మేరకు కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాలను రద్దు చేసి వారి పేర్లను జాబితా నుంచి తొలగించామన్నారు. హైకోర్టు ఆదేశాలతో తమ పేర్లను జాబితాలో చేర్చాలని ఇద్దరు ఎమ్మెల్యేలు కోరారని, దీనిపై సభే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తన కౌంటర్లో పేర్కొన్నారు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో కోర్టు ఆదేశాలను తాను ఎక్కడా కూడా ఉల్లంఘించలేదన్నారు. అనవసరంగా వివాదంలోకి లాగారు ఈ మొత్తం వ్యవహారంలో తనపై ఎటువంటి ఆరోపణలు లేవని న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తన కౌంటర్లో వివరించారు. కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల రద్దుతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సభలో తీసుకున్న నిర్ణయాలకూ తనకూ సంబంధం లేదని వివరించారు. ఈ మొత్తం వివాదంలో అనవసరంగా తనను లాగారని తెలిపారు. కేవలం తాను న్యాయశాఖ కార్యదర్శినే కాక బాధ్యతాయుతమైన న్యాయాధికారిని కూడానని వివరించారు. కాబట్టి కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం అన్నదే ఉండదన్నారు. అందువల్ల తనపై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌ను మూసేయాలని కోరారు. కాగా కోమటిరెడ్డి, సంపత్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరపనుంది. -
కేసీఆర్‌వి నీతిమాలిన రాజకీయాలు: చాడ
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శాసనసభ విలువల్ని కాలరాస్తూ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు పార్టీ ఫిరాయింపుదారుల సభ తప్ప ప్రజాస్వామ్య సభ కాదని ఆయన వ్యాఖ్యానించారు. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్‌కు ఆయన సవాలు విసిరారు. ఖాజీపూర్ వక్ఫ్ భూములు స్వాధీన అంశంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై ప్రత్యక్ష పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతల్లా వ్యవహరిస్తున్నాయని చాడ ధ్వజమెత్తారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్య కూటమి ఏర్పాటు అవసరం ఉందని ఆయన అన్నారు.