సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో సంగారెడ్డి రైతుల పక్షాన పలు అంశాలపై ప్రశ్నిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. సింగూరు-మంజీర నీళ్లు సంగారెడ్డికి అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు హరీష్ రావు మంత్రిగా కొనసాగుతున్నారని.. తాను గత అసెంబ్లీ సమావేశాల నుంచి సంగారెడ్డి కి నీళ్లు కావాలని అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సంగారెడ్డిలో హరీష్‌రావు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారని... ఆ ప్రాంతంలో 70 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు. పంటనష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. లాయర్లకు నెలకు రూ.5వేలు ఇస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment