సాక్షి, హైదరాబాద్: తనకు గోవాలో హోటల్ ఉందని.. రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. శుక్రవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, మనిషి జీవితం ఒకేసారి వస్తుందని..ఎంజాయ్ చేయాలన్నారు తన కుమారుడికి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అడుగుతున్నా.. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు.
చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే రేవంత్‌ను పట్నం మహేందర్ కలిశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి చేరికకు ముందే మహేందర్ కర్చీఫ్ వేశారు. జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే నా పేరు వాడుకుంటున్నారు. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి.. రేవంత్‌ను పొగుడుతున్నాడు. మల్లారెడ్డి పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు. గతంలో రేవంత్‌రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయి’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
సబితారెడ్డితో కేటీఆర్ భేటీ
అసెంబ్లీలో సబితారెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. మహేందర్ రెడ్డి, సునీతారెడ్డి పార్టీ వీడితే ఎదురయ్యే పరిణామాలపై చర్చించారు. ఇప్పటికే ప్రకాష్ గౌడ్, తీగల కృష్ణారెడ్డిలు.. సీఎంను కలవడంపై చర్చాంశనీయంగా మారింది. జిల్లాలో పార్టీ పరిస్థితి పై చర్చించినట్లు సమాచారం
ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం
Comments
Please login to add a commentAdd a comment