
అసలు దొంగలను వదిలేసి.. పేదలకు విద్యా దానం చేస్తున్న తమపై ఐటీ దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: అసలు దొంగలను వదిలేసి.. పేదలకు విద్యా దానం చేస్తున్న తమపై ఐటీ దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారంలో ఆయన శాసనసభలో మాట్లాడుతూ వివేక్, ఈటల మీద ఐటీ దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చాయ్ అమ్మినట్లు పబ్లిక్ ప్రాపర్టీని అమ్ముతున్నారు. ఇప్పుడు సింగరేణిని కూడా అమ్ముతానంటున్నారు’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు.
తెలంగాణలో రామచంద్రుల పాలన నడుస్తోంది. రాముడు అంటే రామారావు. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామరాజ్యం విన్నాం. ఇప్పుడు తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుంది. ఉద్యమ చంద్రుడు ఇవాళ సూర్యుడు అయ్యాడు. కేసీఆర్ పీఎం అవుతాడు.. కేటీఆర్ సీఎం అవుతాడు’’ అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
చదవండి: తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ