టీఆర్‌ఎస్‌ భవన్‌గా అసెంబ్లీ : భట్టివిక్రమార్క | Is assembly Trs Bhavan: Batti vikramarka | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ భవన్‌గా అసెంబ్లీ : భట్టివిక్రమార్క

Published Mon, Mar 27 2017 5:46 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్‌ భవన్‌గా అసెంబ్లీ : భట్టివిక్రమార్క - Sakshi

టీఆర్‌ఎస్‌ భవన్‌గా అసెంబ్లీ : భట్టివిక్రమార్క

హైదరాబాద్‌: అసెంబ్లీని టీఆర్ఎస్ ఆఫీసుగా ప్రభుత్వం భావిస్తోందని కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల తీరుపై గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం గౌరవించడం లేదని, ప్రశ్నించడాన్ని తట్టుకోలేకనే ఇందిరాపార్క్ నుంచి ధర్నాచౌక్‌ను ఎత్తేస్తున్నారని ఆయన ప్రభుత్వాన్నివిమర్శించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించకుండా అధికార పక్షం అడ్డుపడిందని వాపోయారు. 
 
శాసన సభలో ప్రజా సమస్యలను ప్రశ్నించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కారని ఆరోపించారు. ప్రభుత్వం పెట్టిన ఏ బడ్జెట్ కూడా వాస్తవాలకు దగ్గరగా లేదన్నారు. ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన బడ్జెట్లలో అంచనాలకు, ఖర్చుకు మధ్య రూ.30 వేల నుంచి రూ.40 వేల కోట్ల వ్యత్యాసం ఉందని తెలిపారు. ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement