Telangana Assembly: CM KCR Slams On BJP Over Hijab Issue - Sakshi
Sakshi News home page

హిజాబ్ వివాదం ఎందుకు?: CM KCR

Published Tue, Mar 15 2022 4:43 PM | Last Updated on Tue, Mar 15 2022 5:47 PM

CM KCR Slams On BJP Over Hizba Issue Telangana Assembly - Sakshi

హైదారబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. హిజాబ్‌ వ్యవహారంపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. మతకలహాలు సృష్టిస్తూ దేశాన్ని విచ్చినం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఏ దుస్తులు వేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. హిజాబ్ వివాదం ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. ఓవైపు దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

యూపీఏ ప్రభుత్వంపై అనేక రకాల నిందలు వేసి, ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. దేశంలో ఎదైనా పెరిగింది ఉందంటే.. అది కేవలం మత పిచ్చి మాత్రమేనని మండిపడ్డారు. వాళ్లు పెంచుతున్న మత పిచ్చి.. ఓ కార్చిర్చులా మారి దేశాన్నే దహించి వేస్తుందని దుయ్యబట్టారు. తాను దేశ యువత, దేశంలోని మేధావులకు అప్పీల్‌ చేస్తున్నానని.. ఇటువంటి వ్యవహారం దేశానికి మంచిది కాదని అన్నారు.

మత పిచ్చి వల్ల దేశంలో నెలకొల్పబడిన వాతావరణం, దశాబ్దాల పాటు కొనసాగిన కృషి ఒక్కసారిగా కుప్పకూలుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని.. దేశంలో దారుణమైన పరిస్థితి వస్తుందన్నారు. ప్రస్తుతం దేశం అటువంటి స్థితిలోనే ఉందని అన్నారు. దేశంలో మనోత్మాదం, అల్లరి మూకదాడులు పెరుగుతున్నాయని.. దేశాన్ని నడిపే విధానం ఇదేనా? అని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement