హైదరాబాద్ : శనివారం నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లిన యాత్రికులకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా అనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆరా తీస్తున్నారు.
తెలంగాణ నుంచి ఎవరైనా ఇబ్బందులకు గురైతే వెంటనే సహాయం అందించాల్సిందిగా నేపాల్‌లో భారత రాయబారి రంజిత్‌రేకు ఓ లేఖ రాసి పంపించినట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.