దేశంలో మోదీ గాలి వీస్తోంది: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: దేశంలో ఎక్కడ చూసినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాలి వీస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఏపీ బార్ కౌన్సిల్ మీడియా ఇన్‌చార్జి టి.రామదాసప్ప నాయుడు రచించిన ‘మోదీ భారతం’ పుస్తకాన్ని ఆదివారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ పాలనకు దేశ ప్రజలు పట్టం కడుతున్నారని, ఇటీవల జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనమని అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రపంచానికి దిక్సూచిగా ఉండే నాయకత్వ లక్షణాలు మోదీలో ఉన్నాయన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు రామచంద్రరావు, ప్రముఖ రచయిత బీఎస్.రాములు తదితరులు పాల్గొన్నారు..