అన్నదమ్ముల్లా మెలగుతున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అన్నదమ్ముల్లా మెలగుతున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో సభకు ఏపీఎన్జీవోలకు అనుమతిచ్చి, టీజేఏసీ ర్యాలీకి అనువుతి నిరాకరించడంతో ఉద్యోగుల మధ్య విభేదాలు మరింత ముదిరాయని అన్నారు.
బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా కిషన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ జేఏసీ సంయమనం పాటించాలని సూచించారు. తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెట్టాలని కోరుతూ శుక్రవారం వరంగల్‌లో దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ బలపరుస్తుందని, లేకుంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే సీమాంధ్రులను ఒప్పించి తెలంగాణ ఇస్తుందన్నారు. తెలంగాణ మంత్రులు ఇపుడు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. వుహబూబ్‌నగర్‌లో జరగనున్న సదస్సులో పాల్గొనేందుకు బీజేపీ సీనియుర్‌నేత సుష్మాస్వరాజ్ 28న మధ్యాహ్నం వచ్చి, వురుసటిరోజు తిరిగి వెళతారని కిషన్‌రెడ్డి తెలిపారు.