తెలంగాణ సాధన తమతోనే సాధ్యమైందన్న సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు బీజేపీ వ్యూహాన్ని రచించింది.
మన వల్లే తెలంగాణ సాధ్యమైందని చెబుదాం
బీజేపీ వ్యూహం ఖరారు.. ఢిల్లీ రైలు రాష్ట్రంలో ప్రవేశిస్తూనే ‘జైత్రయాత్ర’
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ సాధన తమతోనే సాధ్యమైందన్న సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు బీజేపీ వ్యూహాన్ని రచిం చింది. బిల్లు లోక్‌సభ ఆమోదం పొందగానే మంగళవారం ఢిల్లీలో భేటీ అయిన తెలంగాణ ప్రాంత నేతలు పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేలా చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, టి.ఆచారి, మనోహర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. బిల్లు ఆమోదం పొందడానికి తామే కారణమన్న విషయూన్ని ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాబట్టేలా కార్యక్రమాలు ఉండాలని భావించారు. దీనికనుగుణంగా పార్టీ నేతలందరూ ఢిల్లీ నుంచి 20వ తేదీ సాయంత్రం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరుతారు.
రైలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించిన వెంటనే దీన్ని జైత్రయాత్రగా మార్చాలని నిర్ణరుుంచారు. ఈ మేరకు రైలు ఆగే ప్రతి స్టేషన్‌లో కిషన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. ఢిల్లీ నుంచి వస్తూనే ప్రతి నియోజకవర్గంలో యాత్రలు, పార్టీ పతాకావిష్కరణలు చేపడతారు. కాగా పార్టీకి తక్షణమే రెండు కమిటీలు వేయాలన్న సూచనను కిషన్‌రెడ్డి ఆమోదించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ను కలిసి టీబిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా రాష్ట్ర విభజన విషయంలో ఏర్పడిన గందరగోళానికి కాంగ్రెస్‌దే బాధ్యతని వెంకయ్యనాయుడు అన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై సంతోషపడుతున్నా.. సీమాంధ్రకు జరిగిన అన్యాయం బాధిస్తోందని చెప్పారు.
రాజ్‌నాథ్‌తో టీ టీడీపీ నేతల మంతనాలు: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు రాజ్‌నాథ్‌ను కలిశారు. ఎమ్మెల్యేలు కె.దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి, ఎల్.రమణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, రాములు తదితరులతో కలసి రాజ్‌నాథ్‌తో భేటీ అరుున సీనియర్ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ భేటీ తెలంగాణకు మద్దతిచ్చినందుకు కేవలం ధన్యవాదాలు చెప్పేందుకు మాత్రమే ఉద్దేశించిందని ఆయన చెప్పారు. అరుుతే ఈ సందర్భంగా రాజకీయపరమైన మంతనాలూ జరిపినట్టు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ కుదేలైన నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీలో చేరాలన్న అభిలాషను టీ టీడీపీ నేతలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. కిషన్‌రెడ్డి వీరికి రాజ్‌నాథ్ అపాయింట్‌మెంట్ ఇప్పించినట్లు సమాచారం.